Rishabh Pant: టీమిండియా డైనమిక్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టుల్లో అదరగొడుతున్నాడు. తను టీ20లో ఆడినట్లే టెస్ట్ మ్యాచ్ లో కూడా ఆడి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అయితే, గత ఐపీఎల్ సీజన్ లో రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం అతడికి 27 కోట్ల పైగా ఇచ్చి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ పెయిడ్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. తాజాగా ఇప్పుడు మరోసారి వేలంలోకి రాబోతున్నాడు పంత్.
Read Also: Bengaluru Victory Parade: ఆర్సీబీ ఫ్రాంచైజీకి భారీ షాక్..
అయితే, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోసం జులై 6, 7వ తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. దీంతో ఈ సీజన్లో తాను ఎలాగైనా ఆడాలని చెప్పి తన పేరును కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు. ఎందుకంటే గత సీజన్లో ఆరు జట్లు మాత్రమే తలపడ్డాయి. కానీ, ఈ సీజన్లో మరో రెండు జట్లు కొత్తగా వచ్చి చేరాయి. దీంతో ఈ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మరింత రసవత్తరంగా సాగనుంది. అందులోనూ ఇక్కడ మంచి ప్రదర్శన చేస్తే జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక, రిషబ్ పంత్ తో పాటు మరి కొందరూ ఐపీఎల్ స్టార్లు కూడా ఈ సీజన్లో ఆడనున్నారు. మరీ ముఖ్యంగా గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కి ఆడిన యంగ్ సెన్సేషన్ దిగ్వేష్ రాటి. పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన యంగ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, ఇషాంత్ శర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రానా మరియు మయాంక్ యాదవ్ లాంటి ప్లేయర్లు కూడా ఈ వేలంలోకి రానున్నారు. కాగా, దిగ్వేష్ రాటి, ప్రియాన్ష్ ఆర్య ఇక్కడే అద్భుతమైన ప్రదర్శనతో ఐపీఎల్ సీజన్లో ఛాన్స్ కూడా కొట్టేశారు.
Read Also: ENG vs IND: మూడు కీలక మార్పులు చేసిన టీమిండియా.. ఈసారైనా విజయం వరిస్తుందా..?
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న రిషబ్ పంత్ మొదటి టెస్టులోనే అదరగొట్టాడు. ఆడిన రెండు ఇన్నింగ్స్ లోను రెండు సెంచరీలతో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక, ఇప్పటికే ఐపిఎల్ ఆక్షన్ లో చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ ఈ వేలంలో ఎంత వరకు వెళ్తాడో చూడాలి.