Bengaluru Victory Parade: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. 17 ఏళ్లుగా సాధ్యం కానీ ట్రోఫీని 18వ సీజన్లో ముద్దాడింది. దీంతో 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్సీబీ ప్లేయర్లకు ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాదు ఆర్సీబీ ట్రోఫీని గెలిచిన తర్వాత ఆ మూమెంట్స్ ని ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఎన్నో ఏళ్లుగా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అయితే, చివరికి వాటన్నిటిని అధిగమించి కప్పుని సొంతం చేసుకున్నారు.
Read Also: ENG vs IND: మూడు కీలక మార్పులు చేసిన టీమిండియా.. ఈసారైనా విజయం వరిస్తుందా..?
అయితే, ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత రోజు జరిగిన సంఘటన క్రికెట్ హిస్టరీలో ఒక చేదు జ్ఞాపకంగా నిలవనుంది. ఆర్సీబీ మొదటిసారి కప్పు గెలిచిన ఆనందంలో బెంగళూరులో విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ నిర్వహించారు. అయితే, దీనిపై ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఫైనల్ గెలిచిన 16 గంటల్లోపే దీన్ని నిర్వహించారు. అక్కడి పోలీసులు పర్మిషన్ లేదని చెప్పినా వినకుండా ఆర్సీబీ యాజమాన్యం మాత్రం సోషల్ మీడియాలో విక్టరీ పరేడ్ ఉంది అని పోస్ట్ పెట్టింది. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి వచ్చేశారు. ఎవరు ఊహించనంత మంది రావడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోవడం వల్లే అక్కడ ప్రాణాలు పోయాయని అందరూ దుమ్మెత్తి పోశారు.
Read Also: KTR : ఫార్మాసిటీ హామీలపై మౌనం ఎందుకు..?
కానీ, ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విక్టరీ పరేడ్ లో పాలుపంచుకుంది. ఇక, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎయిర్ పోర్ట్ నుంచి విధాన సౌధ వరకు ర్యాలీ కూడా చేశారు. ఇలా ఎటువంటి భద్రతా చర్యలు పాటించకుండా అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన ఈ పరేడ్లో చివరకు 11 మంది చనిపోయారు. అయితే ఆ తర్వాత ప్రజల నుండి భారీ వ్యతిరేకత రావడంతో కర్ణాటక ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారులని సస్పెండ్ చేసింది. ఇక, దీనిపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఆర్సీబీ యాజమాన్యాన్ని తప్పు పట్టింది. అసలు ఈ తొక్కిసలాటకు కారణం ఆర్సీబీ మేనేజ్మెంట్ అని తేల్చేసింది.
Read Also: War 2: హృతిక్, ఎన్టీఆర్‌లతో విడివిడిగా ప్రమోషన్స్?
ఈ నేపథ్యంలో అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ పై వేటు కూడా పడింది. దీంతో ఈ ట్రిబ్యునల్ వద్దకు ఈ విషయం చేరిన తర్వాత విచారణ చేపట్టిన ట్రిబ్యునల్, ఆర్సీబీ యాజమాన్యానీదే అసలు బాధ్యత అని స్పష్టం చేసింది. దాంతో పాటు వికాస్ కుమార్ ను తిరిగి తన పోస్టులో వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బలమైన సాక్ష్యాధారాలు లేకుండా పోలీసులును ఎలా సస్పెండ్ చేస్తారని గట్టిగానే ప్రశ్నించింది. కాగా, ఆర్సీబీ యాజమాన్యం కూడా సరైన పద్ధతిలో అనుమతి తీసుకోలేదు. పోలీసుల నుంచి కూడా ఆమోదం కూడా పొందలేదు.. అకస్మాత్తుగా సోషల్ మీడియాలో విక్టరీ పరేడ్ గురించి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా జన సమూహం గుమిగూడింది. ఇలా విక్టరీ పరేడ్ కాస్త విషాదంగా మారింది.