Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతురు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ నాయికగా పరిచయమైన చిత్రం ‘తొడక్కమ్‘. ఈనెల 7న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ట్ అందుకుంది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మొదటి రోజు నుంచే సంచలన వసూళ్లను సాధిస్తూ బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది.
విడుదలైన రోజు కేరళలో రూ. 2.60కోట్లతో మంచి ఓపెనింగ్ అందుకుని మౌత్ టాక్ తో మూడో రోజైన ఆదివారం రోజున కేరళ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏకంగా రూ. 4.10 కోట్ల శ్రేణిలో వసూళ్లను రాబట్టింది. దీంతో తొలి 3 రోజుల్లో కేవలం కేరళలోనే ఈ సినిమా మొత్తం రూ. 10.45 కోట్ల గ్రాస్ అందుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది. కేరళలోనే కాకుండా ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లోనూ ‘తొడక్కమ్’ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో దాదాపు రూ. 23.40 కోట్ల వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. ఈ వసూళ్లతో మలయాళ చిత్రసీమ చరిత్రలో లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన రెండో చిత్రంగా ‘తొడక్కమ్’ రికార్డులకెక్కింది. కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా వచ్చిన ‘లోక’ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో టాప్ గ్రాసర్ గా రికార్డ్ చేయగా ఇప్పుడు తొడక్కమ్ అంతే స్థాయిలో ఓపెనింగ్స్ సాధించిన ఫిమేల్ సెంట్రిక్ మూవీలో రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ సాధించడంతో విస్మయ మోహన్‌లాల్ “బ్లాక్‌బస్టర్ స్టార్”గా నెటిజన్స్, ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..