ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ మహిళల సింధూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు చూపించాం అని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఒక పేరు కాదు.. ఒక ఆవేదన.. ఆపరేషన్ సింధూర్ న్యాయం కోసం చేసిన ఓ ప్రతిజ్ఞ అని కొనియాడారు.
Minister Ponnam: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముక్తకంఠంతో సైన్యానికి దేశం మొత్తం సంఘీభావం తెలిపిన కేంద్ర ప్రభుత్వం పోరాటం ఆపివేయడం తీవ్రంగా కలిచివేసింది అన్నారు. మన సైనికులు చేసిన పోరాటం ఎటువంటి కార్యరూపం దాల్చాక ముందే.. ఒక్క ట్విట్టర్ తో దేశ సార్వబౌమత్వాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారు ప్రధాని మోడీ.
మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విక్టరీ ర్యాలీపై సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సదర్భంగా ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు.. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, 26 ఉగ్రవాద లక్ష్యాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లాంగ్ రేంజ్ వైమానిక జరిపిన దాడులను షాహిద్ అఫ్రిది సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది.. ప్రస్తుతం, అతని మానసిక పరిస్థితి బాగాలేదు తక్షణమే చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నాడు.
Virat Kohli Retirement: టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పాడు. ఇక, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడాన్ని స్వాగతిస్తూ అతని భార్య అనుష్క శర్మ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది.. ఆ పోస్టులో.. ‘అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడతారు.. నాకు మాత్రం నువ్వు దాచుకున్న కన్నీళ్లు.. బయటకు తెలియకుండా నీతో నువ్వు చేసిన యుద్ధాలు గుర్తిండి పోతాయని పేర్కొనింది.
EX MLA Jagga Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటెల రాజేందర్ వి నాన్సెన్స్ కామెంట్స్.. రండ అంటే అర్థం ఏంటో చెప్పు ఈటల అని ప్రశ్నించారు.
Jagga Reddy: ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ యుద్ధంపై చర్చ కంటే ఎక్కువ ఇందిరా గాంధీ ఉన్నప్పుడు జరిగిన యుద్ధం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.
లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ఓ క్రికెట్ స్టోరీ చెప్పుకొచ్చారు. మన ఎయిర్ ఫీల్డ్‌లను, లాజిస్టిక్స్‌ను టార్గెట్ చేయడం చాలా కఠినమైన అంశమని తెలిపారు. ఈ అంశాన్ని ఆయన వివరిస్తూ.. క్రికెట్ లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. అయితే, ఈరోజు విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు.. అతను నా ఫెవరేట్ క్రికెటర్ అని పేర్కొన్నారు.
సోమవారం ఉదయం నుంచే భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. అన్ని రంగాలూ షేర్ మార్కెట్ లాభాల్లో కదలాడుతుంది. కాగా, స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి భారీ లాభాల్లో ఉంది. సుమారు 2,950 పాయింట్ల లాభంతో 82, 404 దగ్గర ముగిసింది సెన్సెక్స్. ఇక, 912 పాయింట్ల లాభంలో 24,920 వద్ద నిఫ్టీ ముగిసింది.
జిన్నారంలో ఏం జరుగుతుందో విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను నాలుగుసార్లు ఎంపీగా అడిగినా సరైన సమాధానం లేదు అని పేర్కొన్నారు. దేశద్రోహులను వెంటనే పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చినా.. ఇప్పటికి అధికార యంత్రాంగం స్పందించడం లేదు అని ఆరోపించారు. దేశద్రోహులకు, కాంగ్రెస్‌కు ఉన్న సంబంధం బయటపడింది అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
PCC Chief Mahesh Goud: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడంపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆయన ఏ కులం అనేది క్లారిటీ ఇవ్వాలి? అని డిమాండ్ చేశారు. ముదిరాజా లేక రెడ్డి నా అనేది.. బీజేపీలో పదవులు రాలేదని మాపై అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు.