Fact Check: పాకిస్తాన్ తప్పుడు ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తుంది. దానికి తోడుగా చైనా కూడా చేతులు కలిపింది. పాక్ వదిలే తప్పుడు కథనాలను చైనా, అజర్బైజన్ మీడియా సంస్థలు ప్రచారంలోకి తీసుకొస్తున్నాయి.
భారత్- పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులపై ఆమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా భారత్‌తో పెరిగిన ఉద్రిక్తతను తగ్గించుకోవాలని కోరినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇరు దేశాలు ఘర్షణలను నివారించడానికి "నిర్మాణాత్మక" చర్చలను ప్రారంభించడానికి అమెరికా సహాయం చేస్తుందని పేర్కొన్నారు.
నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) అధికారులతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారని సమాచారం. ఈ భేటీలో అణ్వాయుధాల నియంత్రణ, కార్యాచరణ నిర్ణయాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థతో ఆయన కీలక చర్చలు జరపనున్నారు.
రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులు జరపడంతో.. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ అధికారి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడుల్లో ఆయన మరణించారు.
Pakistani Drone Strike: పాకిస్తాన్ శుక్రవారం నాడు చీకటి పడగానే. భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది. ఇండియాలోని 26 ప్రదేశాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది.
India Pakistan War: పాకిస్తాన్ వరుస దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ను మరోసారి బ్లాకౌట్ చేశారు. వరుసగా రెండో రోజు చీకటి పడగానే డ్రోన్లతో దాడికి పాక్ ప్రయత్నించింది. సుమారు 11 లొకేషన్లలో దాడులకు దిగింది పాకిస్తాన్.
IND vs PAK: పాకిస్తాన్ మళ్ళీ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడటంతో, భారత్ గట్టిగా బుద్ధి చెబుతోంది. పాక్ కాల్పులకు ఇండియన్ ఆర్మీ ధీటుగా జవాబు ఇస్తుంది. ఈ నేపథ్యంలో భారత్- పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
24 Airports Closed: భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల్లోని 24 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మే 15వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొనింది.
India-Pakistan Tensions: భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైయ్యాయి. ఈ పరిణామాల వేళా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (మే 9న) సాయంత్రం త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.