Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Case: కన్నడ హీరో దర్శన్ కేసులో తాజాగా దిమ్మతిరిగే నిజాలు బయటికి వచ్చాయి. హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో A-14 నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారి కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. పవిత్ర గౌడకు రేణుకాస్వామి మెసేజ్‌లు పంపడంపై ఆగ్రహించిన దర్శన్.. అతడిని తీవ్రంగా దూషిస్తూ తల నుంచి రక్తం వచ్చేలా కొట్టాడని ప్రదోష్ తెలిపారు. అనంతరం దర్శన్ పిలవడంతో ఘటనా స్థలానికి వెళ్లిన పవిత్ర గౌడ కూడా రేణుకాస్వామిని చెప్పుతో కొట్టినట్లు ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
అనంతరం రేణుకాస్వామిని అండర్‌వేర్‌తోనే టాటా ఏస్ వాహనానికి వేలాడదీసి నైలాన్ తాడుతో దాడి చేసినట్లు ప్రదోష్ వెల్లడించారు. అన్నం, నీళ్లు ఇచ్చిన తర్వాత దర్శన్.. రేణుకాస్వామి ఛాతీ, మెడపై కాలితో బలంగా తన్నాడని, దీంతో అతడు స్పృహ కోల్పోయాడని పేర్కొన్నారు. ఆ తర్వాత రేణుకాస్వామి ఛాతీపై నిలబడి తొక్కేందుకు దర్శన్ ప్రయత్నించాడని, తాను అతడిని పక్కకు లాగిన సమయంలో రేణుకాస్వామి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించానని ప్రదోష్ వాంగ్మూలంలో చెప్పారు. హత్య విషయం బయటకు రాకుండా సెటిల్ చేయాలని దర్శన్ ఒత్తిడి చేసినట్లు కూడా ప్రదోష్ వెల్లడించారు. విషయం సెటిల్ చేయకపోతే తుపాకీతో కాల్చుకుని చనిపోతానని దర్శన్ బెదిరించినట్లు ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీంతో హత్య విషయం బయటకు రాకుండా ప్రయత్నించామని ప్రదోష్ తెలిపారు. ఇప్పటికే కేసులో కీలక వివరాలు వెల్లడించిన ప్రదోష్.. తనను దర్శన్‌తో కలిసి కాకుండా ప్రత్యేక సెల్లో ఉంచాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.
Also Read
- Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
- Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
- Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
- Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
తాజావార్తలు
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!