Workplace Harassment: బెంగళూరు నగరంలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని టాయిలెట్‌లో రహస్యంగా వీడియో తీసిన ఘటన కలకలం రేపుతుంది. సోమవారం నాడు ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళా ఉద్యోగిని టాయిలెట్‌లో ఉన్న టైంలో ఓ వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీశాడు. అయితే, అక్కడ ఏవో కదలికలను గమనించిన ఆమె గట్టిగా అరిచింది. దీంతో ఆమె కొలీగ్స్ అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతడు సీనియర్ అసోసియేట్‌గా పని చేస్తున్న స్వప్నిల్ నాగేశ్ మాలిగా సిబ్బంది గుర్తించారు.
Read Also: Revanth Reddy: హైకోర్టులో సీఎం క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..!
అయితే, ఈ ఘటనపై బాధితురాలు తొలుత హెచ్‌ఆర్ విభాగంలో కంప్లైంట్ చేసింది. స్వప్నిల్ ఫోన్ చూడగా.. 30కి పైగా మహిళల వీడియోలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో.. ఆ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇక, నిందితుడిపై బీఎన్‌ఎస్, ఐటీ చట్టాల కింద కేసు ఫైల్ చేశారు. ఈ ఘటనపై ఇన్ఫోసిస్ రియాక్ట్ అయింది. సదరు ఉద్యోగిని కంపెనీ నుంచి తీసివేసినట్లు వెల్లడించింది.