Ukraine War: ఉక్రెయిన్ పై మరోసారి రష్యా విరుచుకుపడింది. శనివారం క్షిపణులతో దాడి చేసింది. రష్యాతో జరుగుతన్న యుద్ధంతో ఉక్రెయిన్ కు యుద్ధ ట్యాంకులను అందచేస్తామని బ్రిటన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు చేసింది. ఇదిలా ఉంటే రష్యా క్షిపణల శిథిలాలు తమ భూభాగంలో పడ్డాయని మల్డోవా దేశం ఆరోపించింది. తూర్పు ప్రాంతంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన డ్నిప్రోలో పై క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 15 ఏళ్ల బాలికతో పాటు 12 మంది మరణించారు. 64 మంది గాయడపడినట్లు డ్నిప్రోపెట్రోవ్స్క్ గవర్నర్ వాలైంటైన్ రెజ్నిచెంకో మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లో ప్రకటించారు. గాయపడిన వారిలో ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఈ దాడిలో 9 అంతస్తుల భవనం కుప్పకూలింది. పలువురు శిథిలాల కింద ఇరుక్కుపోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Read Also: Guntur Illegal Affair: మంగళగిరిలో దారుణం…. భార్య, ప్రియుడిపై అనుమానం
అంతకుముందు శనివారం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఉక్రెయిన్ కు ఛాలెంజర్ 2 ట్యాంకులు ఇస్తామని తెలిపాడు. ఉక్రెయిన్ కు భారీ ట్యాంకులు సరఫరా చేసిన మొదటి పాశ్చాత్య దేశంగా బ్రిటన్ అవతరించింది. చాలా వరకు ఇళ్ల దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే తాజా దాడుల వల్ల ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. విద్యుల్ లేక ప్రజలు అల్లాడుతున్నారు. దేశ రాజధాని కీవ్ తో సహా రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ దాడుల్లో దారుణంగా నష్టపోతున్నాయి. జపోరిజ్జియా ప్రాంతంపై కూడా దాడులు జరిగాయి. 30కి పైగా క్షిపణులతో తమపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీ ఆరొోపించాడు.