Vladimir Putin: ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపిణీ చేస్తున్న దేశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి హెచ్చరించాడు. రష్యాతో ఆధునిక యుద్ధం పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన అన్నారు. రష్యాను బెదిరించే ఏ దేశానికైనా తమను ఎదుర్కోవడం తప్పదని వ్లాదిమిర్ పుతిన్ గురువారం హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు ట్యాంకులు పంపిస్తామని వాగ్దానం చేసినందుకు జర్మనీపై ఆయన విరుచుకుపడ్డారు. క్రెమ్లిన్ తాజా దాడి కోసం తన బలగాలను ఏకీకృతం చేస్తోందని ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ హెచ్చరించి త్వరగా ఆయుధాలను పంపాలని పలుదేశాలను కోరిన నేపథ్యంలో పుతిన్ బెదిరింపులు వచ్చాయి.
Crime News: తల్లిని తిట్టాడని తమ్ముడిని కత్తితో పొడిచిన అన్న
రష్యాలోని దక్షిణ నగరమైన వోల్గోగ్రాడ్‌లో పుతిన్ మాట్లాడారు. స్టాలిన్‌గ్రాడ్‌లో 80 ఏళ్ల క్రితం నాజీ సేనలపై తమ సైన్యం సాధించిన విజయాన్ని గుర్తుచేసుకునే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రష్యాతో ఆధునిక యుద్ధం పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు. ఉక్రెయిన్ ఈ నెలలో రష్యన్ దళాలతో పోరాడటానికి ఆధునిక యుద్ధ ట్యాంకుల పంపిణీకి పశ్చిమ దేశాల నుండి వాగ్దానాలను పొందింది. ఉక్రెయిన్ ఇప్పుడు సుదూర క్షిపణులు, ఫైటర్ జెట్‌లను అడుగుతోంది. ఉక్రెయిన్ పాశ్చాత్య మిత్రదేశాలు విధించిన ఆంక్షలను రష్యా ఎదుర్కొంటుందని, ఉక్రెయిన్‌లో తమ సైనిక ప్రచారాన్ని కొనసాగిస్తామని పుతిన్ నొక్కి చెప్పారు.