Joe Biden: మరోసారి “తప్పు”లో కాలేసిన జో బైడెన్.. జెలెన్ స్కీని పుతిన్‌గా సంబోధన..
- మరోసారి దొరికిపోయిన జో బైడెన్..
- జెలెన్ స్కీని పుతిన్ అంటూ సంబోధన..
- వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden: ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పలు సమావేశాల్లో అసలు ఏం చేస్తున్నాడో కూడా అర్థం అవ్వడం లేదు. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ-7 సమావేశాల్లో దేశాధినేతలంతా ఫోటోలకు ఫోజ్ ఇస్తుంటే, బైడెన్ మాత్రం వేరే వైపు వెళ్లడం, అక్కడ ఎవరూ లేకున్నా చేతులతో అభివాదం చేయడం వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన డిబేట్లలో పలువురిని తప్పుగా సంబోధించడం చేశారు. కొన్నిసార్లు అలాగే కదలకుండా నిలబడి ఉంటున్న బైడెన్ తీరుపై అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: India’s Population: 2100 నాటికి తగ్గనున్న ఇండియా జనాభా.. అప్పటికీ చైనా కన్నా 2.5 రెట్లు ఎక్కువే..
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఇదిలా ఉంటే, తాజాగా నాటో సమావేశంలో మరోసారి బైడెన్ తప్పులో కాలేశాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్ స్కీని, పుతిన్‌గా పిలవడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో బైడెన్ జెలెన్ స్కీని ఇలా పిలవడంపై ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ సమయంలో జెలెన్ స్కీ ఏం చేయాలో తెలియక, నవ్వుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
చివరకు బైడెన్ తనను తాను సరిదిద్దుకుంటూ, ‘‘ప్రెసెడెంట్ జెలెన్ స్కీ మీరు పుతిన్‌ని ఓడించబోతున్నారు. నేను పుతిన్‌ని ఓడించడంపై దృష్టి పెట్టాను’’ అని అన్నారు. అప్పటి వరకు షాక్‌లో ఉన్న జెలెన్ స్కీ కోలుకుని ‘‘నేను పుతిన్ కంటే మంచివాడిని’’ అని ప్రతిస్పందించారు. అంతకుముందు కూడా పలుమార్లు బైడెన్ ఇలాగే చేశారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ని వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ మాట్లాడారు. డెమెక్రాట్ల పక్షాన అధ్యక్ష బరిలో ఉన్న బైడెన్‌పై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. అతడిని అధ్యక్ష రేసు నుంచి పక్కన పెట్టేయాలని సొంత పార్టీ నుంచి కోరుతున్నారు.
Biden is Blunder King 😂
Watch Zelensky's reaction when Biden calls him Putin! pic.twitter.com/SlGVFBB9ze
— BALA (@erbmjha) July 12, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..