Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ హత్యకు కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షడు వొలోడిమిర్ జెలన్ స్కీ హత్యకు కుట్ర పన్నిన ఒక వ్యక్తిని పోలాండ్‌లో అరెస్ట్ చేశారు. రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలాండ్, ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు గురువారం తెలిపారు. పావెల్ కే అనే పేరు కలిగిన పోలాండ్ జాతీయుడు, రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందించాడని, జెలన్స్కీని హత్య చేయడానికి ప్లాన్ చేశాడని, ఇందుకు రష్యా ప్రత్యేక దళాలు సాయం చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు మోపపబడ్డాయి. రష్యన్ ఫెడరేషన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌తో తాను పనిచేయడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధంలో నేరుగా పాల్గొన్న రష్యన్ పౌరులతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇతడిపై ఆరోపణలు నిరూపించేందుకు అధికారులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు.
Also Read
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
అనుమానితుడు పోలాండ్ లోని ర్జెస్జో జిసియోంకా విమానాశ్రయంలోని భద్రతా వివరాలను సేకరించి రష్యాకు అందించినట్లు తెలుస్తోంది. జెలన్ స్కీ తన విదేశీ పర్యటనలకు తరుచుగా ఈ విమానాశ్రయం గుండా వెళ్తుంటారు. ఉక్రెయిన్ వెళ్లే విదేశీ అధికారులకు ఇక్కడి నుంచే వెళ్తుంటారు. ఈ కేసు ఉక్రెయిన్, ఉక్రెయిన్ ప్రజలకు మాత్రమే కాకుండా స్వేచ్చా ప్రపంచానికి రష్యా ఒక ముప్పుగా మారిందని ఉక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఆండ్రీ కోస్టిన్ అన్నారు. రష్యా నేర పాలన, ఇతర సార్వభౌమాధికార దేశాల్లో విధ్వంసక కార్యకలాపాలను నిర్వహిస్తోదని అన్నారు.
ఫిబ్రవరి 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పోలాండ్ ఉక్రెయిన్‌కి మద్దతుగా నిలుస్తోంది. మరోవైపు ఈ యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్ స్కీ బలంగా రష్యాను వ్యతిరేకిస్తుండటంతో అతడిని అంతం చేయడానికి రష్యా పథకాలు రూపొందిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వ్యవసాయ దిగుమతులపై వివాదంతో పోలాండ్, ఉక్రెయిన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ, యుద్ధంలో మాత్రం ఉక్రెయిన్‌కి బలమైన మద్దతుదారుగా పోలాండ్ ఉంది.
తాజావార్తలు
-
Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
-
Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
-
Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!