ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను కాపాడి మానవత్వం చాటారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మణిపురం ఫ్లై ఓవర్ పై ఆత్మహత్యాయత్నం చేసింది శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ వివాహిత… స్థానికులు ఎంత సర్దిచెప్పినా వినిపించుకోలేదు ఆమె.. అయితే, ఇంటికి వెళ్తూ సదరు మహిళను గమనించిన ఎమ్మెల్యే ముస్తాఫా.. తన కారు ఆపి.. మహిళకు సర్ది చెప్పారు.. ఆ మహిళ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.. ఇక, కారులో ఎక్కించుకుని సదరు మహిళను తన ఇంటికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే.. ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు..
Read Also: ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు
ఆత్మహత్య చేసుకోకుండా కాపాడడమే కాదు.. ధైర్యంగా ఉండాలని, ఆత్మహత్య చేసుకోకూడదని నచ్చ చెప్పారు. కాగా, కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని సదరు మహిళ ఎమ్మెల్యేకు తెలియజేయడంతో.. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మహిళను ఇంటికి పంపించారు ఎమ్మెల్యే ముస్తఫా… ఇక, ఎమ్మెల్యే మహిళ ప్రాణాలు కాపాడినందుకు నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.