వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. తాజా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దుర్మార్గమైన పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కేంద్ర నిధులిస్తుంటే జగన్ తన సొంత పథకాల పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఆదాయ వనరుగా చేసుకొని జగన్ దోచుకుంటున్నారన్నారు.
సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ జోక్యం తగదని ఆయన హితవు పలికారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసేందుకు బీజేపీ తరుఫున మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. అంతేకాకుండా వైసీపీ పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.