ఆగట్టునుంచి ఈగట్టుకి.. ఆయన రూటే సెపరేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయన ఎప్పుడు ఏ గట్టున ఉంటారో తెలియదు. ఇప్పటివరకు ఏ పార్టీలోనూ కుదురుగా లేరు. ఇప్పుడు కొత్త గూటికి చేరారు. అక్కడ ఎన్నిరోజులు ఉంటారో.. ఏమో? ఎందుకు పదే పదే కండువా మార్చేస్తున్నారు?ఆయనే గట్టు రామచంద్రరావు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన.. గతంలో కమ్యూనిస్ట్. లెఫ్ట్ పార్టీల హవా నడిచిన సమయంలో సీపీఎం నాయకుడిగా గళం వినిపించేవారు. 2008లో CPM నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించి సంచలనం రేపారు. అక్కడ నుంచి ఆయన పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అయిపోయింది. ప్రజారాజ్యంపార్టీలో చేరి కొన్నాళ్లు అక్కడున్నారు రామచంద్రరావు. ఆపై కాంగ్రెస్‌లో రాజకీయ ప్రయాణం కొనసాగించారు. వైఎస్ అభిమానిగా ఉంటూ.. ఆయన చేసిన కామెంట్స్ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి దారితీశాయి. పార్టీ వేటు వేయడంతో వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం.. తెలంగాణలో వైసీపీ మనుగడ లేదని భావించి.. 2015లో టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు రామచంద్రరావు. అలా ఏడేళ్ల కాలంలోనే నాలుగు పార్టీల్లోకి వెళ్లిన ఘనత ఆయనదే.
గత ఏడాది నవంబర్‌లో టీఆర్‌ఎస్‌కూ గుడ్‌బై
తక్కువ సమయంలోనే వరసగా పార్టీలు మారుతూ వచ్చిన గట్టు రామచంద్రరావు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ పార్టీ కండువాతో కనిపిస్తారో అని వ్యంగ్యాస్త్రాలు వినిపించాయి. పోనీలే.. ఎటూ కదలకుండా టీఆర్‌ఎస్‌లో ఉంటున్నారని అనుకుంటున్న సమయంలో గత ఏడాది నవంబర్‌లో సడెన్‌గా ఆయన చర్చల్లోకి వచ్చారు. టీఆర్‌ఎస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయానని, అధికారపార్టీలో కొనసాగడం కరెక్టు కాదని చెబుతూ ఒక లేఖ రాసిపడేసి.. గులాబీ గూటికి గుడ్‌బై చెప్పేశారు రామచంద్రరావు. వాస్తవానికి టీఆర్ఎస్‌లో ఆయన ఎమ్మెల్సీ ఆశించారట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందారట.
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
తాజాగా వైఎస్‌ఆర్‌టీపీలో చేరిక
రెండు నెలలుగా మెడలో ఏ కండువా లేకుండా రోజులు గడిపేసిన గట్టు రామచంద్రరావు.. ఇప్పుడు కొత్త కండువాతో తళుక్కుమన్నారు. షర్మిల పార్టీలో చేరడంతో ఆయన ఖాతాలో మరో పార్టీకి చోటు దక్కింది. మరి.. YSRTPలోనేనైనా ఆయన కుదురుగా ఉంటారా? ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం కొనసాగలేరనే ప్రచారాన్ని నిజం చేస్తారా? రాజకీయాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. ప్రజాప్రతినిధి కాకపోయినా.. బీసీ నేతగా జనాల్లోకి వచ్చి.. వివిధ పార్టీలలో చేరి తనకంటూ ఒక గట్టు ఏర్పాటు చేసుకున్నారు రామచంద్రరావు. కానీ ఏ పార్టీ నుంచీ చట్టసభల్లోకి వెళ్లలేకపోయారు. కొత్త శిబిరంలోనైనా ఆయన ఫెవికాల్ రాసుకుని కూర్చుంటారో.. లేక కండువా ఇస్త్రీ మడత నలగక ముందే జారిపోతారో చూడాలి.
తాజావార్తలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!