టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ జరిగిందన్న వ్యవహారంపై తాము విచారణ చేపట్టామని విజయవాడ సీపీ క్రాంతి రాణా వెల్లడించారు. అయితే రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు తమకు ఆధారాలేమీ దొరకలేదని సీపీ స్పష్టం చేశారు. రాధాకు గన్‌మెన్‌లను కేటాయించామని.. అయితే ఆయన తిరస్కరించారన్నారు. పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని క్రాంతి రాణా మండిపడ్డారు.
Read Also: తత్కాల్ రూపంలో రైల్వేకు భారీ ఆదాయం
రాధాపై రెక్కీకి సంబంధించి తాము రెండు నెలల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామని సీపీ తెలిపారు. ఈ విషయంపై ఇంకా పూర్థిస్తాయిలో విచారణ కొనసాగుతోందన్నారు. రాధాను కలిసి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారని.. త్వరలోనే ఈ కేసుపై అన్ని వివరాలు వెల్లడిస్తామని సీపీ పేర్కొన్నారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కాగా రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారనే విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీపీ క్రాంతి రాణా స్పష్టం చేశారు.