Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwin: 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ వెన్నెముకగా నిలిచారు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైనా, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చి సంచలన ఇన్నింగ్స్‌లతో భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టారు. అయితేవరల్డ్ కప్ హీరో సంజుపై అశ్విన్ కోపంగా ఉన్నారు. అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PPF Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.150తో చేతికి రూ.24 లక్షలు!.. రిస్క్ జీరో
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
సంజు విధ్వంసం.. అశ్విన్ విశ్లేషణ..
తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్, సంజు ఆటతీరును ప్రశంసిస్తూనే ఒక అభిమానిగా తన అసంతృప్తిని బయటపెట్టారు. “ఒక క్రికెటర్‌గా, బ్యాట్స్‌మన్‌గా సంజు ఈ టోర్నీలో మూడు సెంచరీలు చేయాల్సింది. అతను వెస్టిండీస్‌పై 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నేను కొంచెం కఠినంగా మాట్లాడుతున్నట్లు అనిపించవచ్చు, కానీ ఒక అభిమానిగా అతను ఆ మూడు సెంచరీలు పూర్తి చేసి ఉండాలని కోరుకున్నాను. కేవలం 10 సింగిల్స్ తీసి ఉంటే అతను సులభంగా సెంచరీ మార్కును అందుకునేవాడు.” అని అశ్విన్ పేర్కొన్నారు. సంజు శామ్సన్ తన వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాడని అశ్విన్ కొనియాడారు. “సంజు ఎప్పుడూ తన కోసం ఆడడు. ఉద్దేశపూర్వకంగా బ్యాటింగ్ చేస్తూ జట్టును ముందుకు తీసుకెళ్తాడు. సెంచరీ కోసం పాకులాడకుండా పెద్ద షాట్లు ఆడుతూ అవుట్ అవ్వడమే అతని ప్రత్యేకత. అదే అతడిని అందరికీ ఇష్టమైన ఆటగాడిగా మార్చింది. కానీ, అంత గొప్పగా ఆడి కూడా సెంచరీ సాధించలేకపోవడం నాకు బాధ కలిగిస్తోంది.” అని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రపంచకప్‌లో సంజు శామ్సన్ కేవలం 321 పరుగులు చేయడమే కాకుండా, అత్యంత కీలక సమయాల్లో రాణించారు. వెస్టిండీస్‌పై 97* పరుగులు చేసి భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చారు. ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో 89 పరుగులతో భారీ స్కోరు అందించారు. న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి 89 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టోర్నీ ఆరంభంలో అవకాశాలు రాకపోయినా, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజు శామ్సన్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారారు.
READ ALSO: Prabhas: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన మలయాళ డైరెక్టర్.. క్రేజీ కాంబోపై ఫిక్స్ అయ్యిందా!
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!