మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రైల్వే జోన్‌పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ రైల్వే జోన్‌పై ఏం సమాధానం చెబుతారన్నారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా…
ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం పనుల్లో అవినీతి జరిగిందన్నారని.. కానీ కేంద్రం ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని తేల్చిచెప్పిందన్నారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టులను నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్‌లో ఏం సాధించారు..? అని ఆయన ప్రశ్నించారు. అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు. చిత్తశుద్ది ఉంటే వైసీపీ ఎంపీలు…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం తీరుపై పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
ఏపీలో మరోసారి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణ విముక్తి విషయంలో ఏమి జరిగిందో, లక్ష కోట్లు 20 వేల కోట్లు ఎలా అయ్యాయో అందరికీ తెలుసునని అన్నారు. అంతేకాకుండా మీడియా ముసుగులో దశబ్దాలు తరబడి టీడీపీ కోసం రౌడీయిజం, రుబాబు చేస్తున్నారని, చంద్రబాబు వస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలను రోజూ…
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అయితే నేడు మీడియాతో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆ గట్టా…ఈ గట్టా…? అంటూ ప్రశ్నించారు. మేమైతే పవన్ బీజేపీతోనే ఉన్నారని అనుకుంటున్నామని, ఆయన చేయగలిగింది కూడా ఉందని, జగన్ ఇచ్చిన సలహాలు పరిగణలోకి తీసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపండి అని కొరొచ్చునని సూచించారు. మోడీకి ఒక వినతి ఇచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి అంటూ ఆయన…
ఏపీలో ఓటీఎస్‌పై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వన్ టైం సెటిల్మెంట్ అంటూ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకంపై మీడియా పేరుతో కొన్ని సంస్థలు టెర్రరిజం చేస్తున్నాయంటూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని, ఈ పథకం వల్ల పేదలకు జరిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. గత టీడీపీ ప్రభుత్వం కనీసం వడ్డీ…
పార్లమెంట్ శీతాకాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయనే ప్రకటించారు.. ప్రధాని మోడీతో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు విజయసాయిరెడ్డి.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రధాని…
ఓటీఎస్ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.. ముఖ్యంగా టీడీపీ ఈ విషయంలో వైసీపీ సర్కార్‌ను నిలదీస్తోంది… అయితే, విపక్షాలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు సీఎం వైఎస్ జగన్.. ఓటీఎస్ పథకం, గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా.. ఓటీఎస్ పథకం పై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.. ఓటీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి.. ఓటీఎస్ అన్నది పూర్తి స్వచ్ఛందం.. క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ జరుగుతుంది.. రూ.10వేల కోట్ల రూపాయల…
ఏపీలో ఇటీవల ఎన్నికైన 11 మంది కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం కార్యక్రమం మండలిలో జరుగుతోంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మండలిలో బలం ఉందని ప్రతిపక్షం ఎలా వ్యవహారించిందో చూశామని, ఈ రోజు శుభదినమన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి జగన్ తప్పక న్యాయం చేస్తారనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, నేతల మధ్య విభేదాలున్నా కలిసి కట్టుగా పని చేసి, ప్రజల…