సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు: వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ వాళ్లు పరిశ్రమలో ఉన్నారు కాబట్టే సినిమా వాళ్లకు చంద్రబాబు సపోర్ట్ ఇస్తున్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఆరోపించారు. సినిమా టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పేదల కోసమే తమ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లను తగ్గించిందన్నారు. సినీ హీరోలు కోట్లు ఆర్జిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని.. పేదలు వినోదం కోసం సినిమాకు వెళ్తే రూ.వెయ్యి, రూ.2వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఎమ్మెల్యే నల్లపురెడ్డి పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి టాలీవుడ్‌లో ప్రస్తుతం నడుస్తున్న టిక్కెట్ల రేట్ల అంశం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా వాళ్ల పొట్టలు కొడుతున్నామంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు ఏపీని పట్టించుకోవడం లేదని.. అసలు జగన్ అనే ఒక సీఎం ఉన్నారని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు పట్టించుకుంటున్నారా అని ఆయన వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లు హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణలోనే సినిమాలు తీస్తున్నారని మండిపడ్డారు. అసలు వాళ్లకు ఏపీ గుర్తుందా అని ప్రశ్నించారు. చంద్రబాబే మాఫియా కంటే పెద్ద లీడర్ అని… మళ్లీ ఆయన తమ మీద ఆరోపణలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!