చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో గత మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ రోజు శెట్టిపల్లె గ్రామ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. రామకుప్పం మండలం శివాజీ నగర్‌లో అంబేద్కర్ విగ్రహ వివాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంగా ఉండే వ్యక్తి చేపల మార్కెట్ గురించి మాట్లాడుతారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారతి సిమెంట్ రేటు తగ్గించరు.. కానీ సినిమా టికెట్ లు తగ్గిస్తారట అంటూ విమర్శించారు. సీఎం జగన్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించారు.
ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ఇచ్చారు. ఉద్యోగులను పీఆర్సీ పై మాట్లాడకుండా చేశారు. నాయకులు మాత్రం హర్షం ప్రకటించారు. ఉద్యోగులు కాదు. పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచారు. రిటైర్ అయితే ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేక ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. అది పులివెందుల తరహా రాజకీయం. 26 వేల కోట్ల లోటు ఉన్నా 43 శాతం ఫిటి మెంట్ ఇచ్చా. టీడీపీ హయాం లో ఐఆర్ 23 శాతం ఇచ్చి 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.