రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 175 స్థానాల్లో విజయం సాధించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. పని విధానంలో వెనుకబడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్న విషయం విదితమే.
Tammineni Sitaram: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చరిత్ర ఉందని.. నాడు ప్రజల తీవ్రమైన భావావేశాన్ని ప్రదర్శించి గట్టిగా అడిగారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, జీవించే హక్కు కోసం…
Andhra Pradesh: అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు మరోసారి నిరసన తగిలింది. ఎమ్మెల్యే కన్నబాబు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దొప్పెర్ల గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఎమ్మెల్యే వివక్ష చూపిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు వద్దు-జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. కన్నబాబు అరాచకాలు సీఎం జగన్ వరకు చేరాలని.. కన్నబాబు అరాచకాలు నశించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజుతో దొప్పెర్ల…
నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో పక్కాగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్.. దీని ద్వారా కొత్త తరహాలో సమస్యలు వెలికితీస్తామని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్… శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అచ్చెన్నాయుడు అభద్రతా భావంతో కొట్టుమిట్టాడితున్నారని ఎద్దేవా చేశారు.. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో నీవు ఏ పార్టీకి ఓటేస్తావు.. ఏ పార్టీ తరఫున నామినేషన్ వేస్తావు..? అంటూ అచ్చెన్నాయుడుని ప్రశ్నించారు.. పార్టీలేదు, బొక్కాలేదు అన్న పార్టీకే నామినేషన్ వేస్తావా..? నీకు సిగ్గుందా..! అంటూ ఫైర్ అయిన ఆయన.. 18 నెలలు ముందే నా టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యింది… నీ…
చంద్రబాబు-పవన్ కలుస్తారు అని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం.. అదే జరుగుతుందన్న ఆయన.. రాష్ట్రంలో సమస్యలు ఉంటే ఎవరైనా చెప్పుకుంటారు.. పవన్ కల్యాణ్‌కి ఏమైనా సమస్యలు ఉంటే ఆయనే ప్రశ్నించవచ్చు అన్నారు మంత్రి బొత్స
అమరావతి రైతుల యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే ఎక్కడికీ వారిని దేవుడు రానివ్వడం లేదని పేర్కొన్నారు బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.
NTR University: ఏపీలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు వైసీపీ సర్కారు చేసిన తీర్మానానికి సోమవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మారుస్తూ అధికార వైసీపీ తీర్మానం ప్రవేశపెట్టగా..ఆ పార్టీకి సభలో ఉన్న బలం ఆధారంగా సభ…
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం జగన్ కు లేఖ రాశారు కన్నా లక్ష్మీనారాయణ.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపులకు కేటాయించాలని లేఖలో కోరారు.