Minister Roja: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామిని ఏపీ టూరిజంశాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్శంగా స్వామి, అమ్మవార్లకు రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మీడియా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక రౌడీ మాదిరిగా కారు మీద కూర్చుని ఇప్పటం వెళ్లాడని సెటైర్లు వేశారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ ఇప్పటం వెళ్లాలి కానీ.. పవన్ కళ్యాణ్ వెళ్లడమేంటని మంత్రి రోజా ప్రశ్నించారు. అయినా పవన్ కళ్యాణ్ ఇప్పటం వచ్చినా, వైజాగ్ వెళ్లి తమకే ఉపయోగం అని ఆమె అభిప్రాయపడ్డారు.
Read Also: JC Prabhakar Reddy: రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. మహిళా కలెక్టర్‌కు వార్నింగ్
ఏపీలో జగన్ హవా కొనసాగుతుందని.. తమ పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో మరో 20, 30 ఏళ్ల వరకు జగన్ తగ్గేది లేదు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నెగ్గేది లేదని చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కలిసి పోటీ చేసినా తమకు నష్టం లేదన్నారు. పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు కరివేపాకులా తీసిపడేస్తారని.. అదే చంద్రబాబు నైజమని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని మంత్రి రోజా హితవు పలికారు. కాగా శ్రీశైలం మండలం సున్నిపెంట కొత్తబజారులో గాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రి రోజా, ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రోజాను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.