Andhra Pradesh: విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమాన సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ-షార్జా మధ్య రాకపోకలు కూడా ప్రారంభం కావడంతో షార్జా నుంచి విమానం గన్నవరం చేరుకుంది. షార్జా వెళ్లే విమాన సర్వీసును గన్నవరం విమానాశ్రయం నుంచి వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి… టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు షార్జా విమానం ఎక్కిన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు…
Pawan Kalyan: అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పీఏసీ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ కేంద్రంగా అధికార పార్టీ వైసీపీ విధ్వంసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. అక్కడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. వివాదాలు సృష్టించి కల్లోలాలు రేపాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందని పవన్ విమర్శలు చేశారు. ఇందులో భాగంగానే ఈనెల 15న జరిగిన జనసేన జనవాణి…
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఏ చిన్న ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగినప్పుడు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజంగా జరుగుతుందని.. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా ఈరోజు జనసేన పీఏసీ సమావేశం జరిగిందని పేర్ని నాని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగనన్న కాలనీలు…
Pawan Kalyan: ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వైసీపీ మంత్రులపై దాడి చేశారన్న ఆరోపణలతో 9 మంది జనసేన నేతలను పోలీసులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక కోర్టు వారికి బెయిల్ నిరాకరించగా.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ తమ నేతలకు బెయిల్ వచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు జైలు నుంచి విడుదలైన తమ పార్టీ నేతలను శనివారం మంగళగిరిలోని జనసేన…
Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వైసీపీలోని కాపు వర్గీయులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చర్యలతోనే కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో రాజమండ్రిలో ఈ అంశంపై కాపునేతలంతా సమావేశమై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాపులపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై,…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే పేరు పెట్టుకోవటానికి వీలు లేదన్నారు.. ప్రధానిమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టకపోతే జగనన్న కాలనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా.. కేంద్రం నిధులు నిలిపేస్తామని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్, మంత్రులు అర్ధరహితమైన భాష మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన..…
ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజల తరుపున ఎవరు నిలబడ్డారో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. మూడు రాజధానులపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోన్న సమయంలో.. ఓవైపు మూడు రాజధానులు.. మరోవైపు అమరావతి రాజధాని డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసి ప్రయాణం సుఖం , సురక్షితం అన్నారు.. ఆర్టీసీ బస్సులను వాడుకొనపొవడమే ప్రమాదాలకు…
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజధానిగా అమరావతి వైఎస్ జగన్ సమర్ధించలేదన్నారు.. మూడు రాజధానులపై సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన నిర్వహించారు.. ర్యాలీ ప్రారంభానికి ముందు భూమనపై పూల వర్షం కురిపించారు.. మూడు రాజధానులు, రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గుండె చప్పుడు వినిపిస్తూ మహా ప్రదర్శన జరిగింది.. స్థానిక కృష్ణాపురం ఠాణా…
కాంగ్రెస్ పార్టీ అధ్యాయం ముగిసింది.. 2024లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు... 2024లో తిరిగి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.