Jogi Ramesh: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో వైసీపీ సర్కారుపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. పిచ్చి కళ్యాణ్ పిచ్చి కూతలు కూశాడని.. జనవరి నెలలోనే ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ కోసం అధికారులు పనులు ప్రారంభించారని.. ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని స్పష్టం చేశారు. ఇప్పటంలో అభివృద్ధి జరుగుతుంటే పవన్ ఎందుకు అడ్డుకుంటున్నాడో తెలియడంలేదని మండిపడ్డారు. ప్రహరీగోడలు మాత్రమే తొలగించారని.. దీనికే పవన్ ప్రజలను రెచ్చగొడుతున్నాడని జోగి…
Andhra Pradesh: ఏపీలో ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అయినా వైసీపీ ఈ అంశంపై ముందుకు వెళ్లి పేరు మార్పుపై జీవో విడుదల చేసింది. తాజాగా ఈ విషయమై టీడీపీ పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టింది. విజయనగరం నియోజకవర్గ కేంద్రంలో 17 వేల పోస్టు కార్డులను సేకరించింది. ఈ పోస్టు కార్డులను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ కార్యాలయాలకు పోస్ట్ చేస్తామని టీడీపీ నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా…
Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన అంశంపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. చంద్రబాబు సరికొత్త నాటకానికి తెరతీశాడని ఆరోపించారు. ఆయన విషపు రాజకీయ కుట్రలో ఇది ఒక కోణమని.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనపై తానే రాయి విసిరించుకున్నాడని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జగన్ దమ్మున్న నాయకుడు అని.. తనను అరెస్ట్ చేసి జైలుకు పంపినా సంయమనంతో వ్యవహరించి ప్రజల మనసులను…
YSRCP Leaders: అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ కాపు, రెడ్డి, కమ్మ కార్పొరేషన్ల ఛైర్మన్లు శుక్రవారం మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కులాల ఛైర్మన్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటిపై రెక్కీ తన ఆధ్వర్యంలోనే జరిగిందని ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. తన కారు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని.. అయితే తన…
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర రెక్కీ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.. హైదరాబాద్‌లోని పవన్ ఇంటి దగ్గర రెక్కీ, సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణ హాట్ టాపిక్ అయిపోయింది.. పవన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మన నేతను గుర్తుతెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారు.. ఏం జరుగుతోందో ఏమో అని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, పవన్ విశాఖ పర్యటన తర్వాతే ఇలా…
పవన్ కల్యాణ్ ఇంటి వద్జ రెక్కీ చేస్తారా..? పవన్‌పై దాడులు చేద్దామనుకుంటారా..? ఎవరిని బతకనివ్వరా..? అందర్నీ చంపేస్తారా..? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు
యనమల ప్రకటనలో ఏ ఒక్కటీ వాస్తవం ఉండదు అని ఫైర్ అయ్యారు మంత్రి బుగ్గన.. ఏది అనుకూలంగా ఉంటే.. యనమల దానినే తీసుకుంటారు.. గతంలో ఎంతో ధనాన్ని మూటగట్టి.. ఈ ప్రభుత్వానికి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో ఎందుకు విజయం సాధించ కూడదు.. ఇది నా ఒక్కడి వలన జరిగేది కాదు.. నేను చేయాల్సింది నేను చేయాలి. మీరు చేయాల్సింది మీరు చేయాలి.. ఇద్దరం కలిసికట్టుగా చేయాలి అన్నారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.. నేను బటన్ సరిగ్గా నొక్కాలి. అక్కడ…