Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రముఖ నటుడు అలీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు అలీ కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా విలువైన సలహాలు, సూచనలు అందించి ప్రభుత్వానికి, మీడియాకు తన వంతు సహకారం అందిస్తూ మీడియా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని అలీ చెప్పారు. సీఎం జగన్ మనసున్న నాయకుడు అని ప్రశంసలు కురిపించారు. ప్రజలు ఏం కావాలో మరీ తెలుసుకుని సీఎం జగన్ అన్నీ చేస్తున్నారని.. 2024లో ప్రజలు మళ్లీ ఆయనకు పట్టం కట్టడం ఖాయమని అలీ పేర్కొన్నారు.
Read Also: వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్లు.. ఈ తారలు
అటు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం ఘటనపైనా అలీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. రోడ్ల విస్తరణను పవన్ కళ్యాణ్ తప్పుబట్టగా అలీ మాత్రం సమర్థించారు. రోడ్ల విస్తరణ అనేది అన్ని చోట్లా జరిగేదే అని అలీ అన్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధిని కాంక్షించాలరి.. ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు హర్షించాలని సూచించారు. అటు తనపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని పూర్తి న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అలీ అభిప్రాయపడ్డారు.