YSRCP: అనంతపురం జిల్లాలో వైసీపీ కీలక నేత కాపు రామచంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం జగన్‌కు లేఖ రాశారు. తమ కుటుంబంలో ఇటీవల జరిగిన విషాద సంఘటనతో పాటు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నందున తాను జిల్లా అధ్యక్ష పదవిని నిర్వహించలేకపోతున్నట్లు లేఖలో కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనవిజ్ఞప్తి మన్నించి తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో కోరారు.
Read Also: Cab Driver Attacked: రూ. 200 కోసం 20 మంది దాడి.. కోమాలో క్యాబ్ డ్రైవర్
కాగా ఈ ఏడాది ఆగస్టులో కాపురామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఇంటిలో మంజునాథ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. మంజునాథ్‌రెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి పేరు మహేశ్వర్ రెడ్డి. మంజునాథ్ రెడ్డి తండ్రి కూడా వైసీపీలో ఉన్నారు. అంతేకాదు పీఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థను నడుపుతున్నారు. అటు మంజునాథ్ భార్య, కాపురామచంద్రారెడ్డి కుమార్తె స్రవంతి డాక్టర్‌గా పనిచేస్తున్నారు.