2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యే పోటీ ఉంటుందని జోస్యం చెప్పారు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్.
Gorantla Madhav: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో గోరంట్ల మాధవ్ నివసిస్తున్న ఇంటి అద్దె, కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించట్లేదని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతపురం రాంనగర్‌లోని తన ఇంట్లో ఎంపీ గోరంట్ల మాధవ్ అద్దెకు ఉంటున్నారని.. ఇప్పటివరకు రూ.2 లక్షలకు పైగా అద్దె, కరెంట్ బకాయిలు ఉన్నట్లు తెలిపాడు. అవి చెల్లించకపోగా, ఇల్లు ఖాళీ చేయనని ఎంపీ తన అనుచరులతో బెదిరిస్తున్నారని చెప్పాడు. దీనిపై అనంతపురం ఫోర్త్…
YSRCP: అనంతపురం జిల్లాలో వైసీపీ కీలక నేత కాపు రామచంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం జగన్‌కు లేఖ రాశారు. తమ కుటుంబంలో ఇటీవల జరిగిన విషాద సంఘటనతో పాటు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నందున తాను జిల్లా అధ్యక్ష పదవిని నిర్వహించలేకపోతున్నట్లు లేఖలో కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తనకు జిల్లా అధ్యక్ష…
Vishakapatnam: విశాఖ భూముల అంశంపై కొన్నిరోజులుగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు రోజుల కిందట వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు దొంగల పార్టీ కబ్జాకోరులు, భూబకాసురులైన గంజాయి పాత్రుడు, పీలా గోవిందు, బండారు, గీతం భరత్, వెలగపూడి రాము ఆక్రమించిన భూముల్ని కక్కించి ప్రభుత్వానికి అప్పగిస్తుంటే అడ్డగోలు బాగోతాలు, వాదనలకు దిగారని.. ఈ ద్రోహుల నుంచి 5 వేల కోట్ల…
Dharmana Prasad Rao: విశాఖ రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సంస్కరణలు చేసే వాళ్లపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీఎం జగన్ కూడా సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని అందుకే ఆయనపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ధర్మాన తెలిపారు. సంస్కరణలకు ముందే ఫలితాలు రావని.. అందుకే ప్రజల ఆమోదం ఉండదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటే దానికి కారణం…
జనసేన పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది.. ఈ నెల 12,13,14 తేదీల్లో జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్లపై జనసేన పార్టీ సోషల్ ఆడిట్ చేపట్టబోతోంది… మూడు రోజుల పాటు జనసేన నిర్వహించే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నారు.. రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో జరిగే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించారు.. అంతేకాదు.. మరో ఒకట్రొండు చోట్ల కూడా పాల్గొందామా..? వద్దా..? అనే అంశంపై పవన్ కల్యాణ్…
Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రముఖ నటుడు అలీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు అలీ కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా విలువైన సలహాలు, సూచనలు అందించి ప్రభుత్వానికి, మీడియాకు తన వంతు సహకారం అందిస్తూ మీడియా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని అలీ చెప్పారు. సీఎం జగన్ మనసున్న నాయకుడు అని ప్రశంసలు కురిపించారు. ప్రజలు ఏం కావాలో మరీ తెలుసుకుని సీఎం జగన్ అన్నీ చేస్తున్నారని..…
Minister Roja: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామిని ఏపీ టూరిజంశాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్శంగా స్వామి, అమ్మవార్లకు రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మీడియా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక రౌడీ మాదిరిగా కారు మీద కూర్చుని ఇప్పటం వెళ్లాడని…
Vidadala Rajini: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ను సోమవారం మధ్యాహ్నం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎయిమ్స్‌కు ఇవ్వాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేశామని తెలిపారు. రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ సిస్టం కోసం సుమారుగా రూ.50 కోట్లను ఖర్చు చేశామని మంత్రి విడదల రజినీ వెల్లడించారు. పొల్యూషన్ బోర్డ్, ఫారెస్ట్ డిపార్టుమెంట్ క్లియరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు.…