ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరింది.. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీలో రాత్రి బస చేసిన కేంద్రం నుంచి బయల్దేరనున్న సీఎం జగన్.. మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుంటారు.. ఇక, స్థానిక చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు..
గత ఐదేళ్లలో జరిగిన మంచిని చూసి ప్రజలందరూ అభివృద్ధికి అండగా నిలవాలని.. సంక్షేమ ప్రభుత్వ విజయానికి సారథులుగా ఉండాలని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.
మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కీలకమైన సమయాల్లో తన యాత్రకు బ్రేక్ ఇస్తూ ఇస్తున్నారు.. ఇక, ఇవాళ "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర కు బ్రేక్ పడింది.. ఉత్తరాంధ్రలో ఎన్నికల వ్యూహంపై కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు జగన్.. సీనియర్ నేతలతో అంతర్గత సమావేశం కానున్నారట.
ఈనెల 26,27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని వైసీపీ మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను ఖరారు చేయడంపై తుది కసరత్తు జరుగుతోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చానని రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ అంటున్నారు. బీసీలకు అత్యధిక స్థానాలను ఇచ్చిన పార్టీ వైసీపీ అని ఆయన పేర్కొన్నారు.
మేమంతా మౌనంగా ఉన్నాం.. అనవసరంగా వివాదాలు సృష్టించొద్దు.. మేం దణ్ణం పెట్టి చెబుతున్నాం.. హత్యలు, దాడులకు దూరంగా ఉండాలి అని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. మీ దాడులకు మా రియక్షన్ వేరేలా ఉంటే టీడీపీ నేతలు తట్టుకోలేరు అని హెచ్చరించారు.