Harirama Jogaiah Letter: అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు.. మరోవైపు కాపులకు ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూ వస్తున్నా మాజీ మంత్రి, కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. ఇప్పుడు మరో బహిరంగ లేఖ విడుదల చేశారు.. బై బై వైసీసీ అనే నినాదం నిజం కావాలంటే కాపుల ఓట్లే కీలకం అని పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కులాలే విజయావకాశాలను శాసిస్తున్నాయని పేర్కొన్న ఆయన.. కాపుల ఓట్లు జనసేనకు కలవడంతో కూటమి ఓటింగ్ 52 శాతానికి పెరిగిందన్నారు. కాపుల ఓట్లు పూర్తిగా ట్రాన్స్‌ఫర్ కావాలి అంటే అధికార పంపిణీ జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించడం అవసరం అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదటి స్థానంలోనూ.. లా అండ్ ఆర్డర్ హోమ్ పోర్టు పోలియోలతో పవన్ కల్యాణ్ రెండో స్థానంలో అదరించబోతున్నారనేది వార్త.. ఈ వార్త మీరు పార్టీల కార్యకర్తలను సంతృప్తి పరచగలిగేదే.. ఓట్ల ట్రాన్స్‌ఫర్ సవ్యంగా జరగడానికి కారణం అవుతుందన్నారు.. అలా జరిగితే బై బై వైసీపీ అనే నినాదం నిజం అవుతుందని తన లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి, కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య..
Read Also: Israel Hamas War : తల్లి మరణానంతరం పుట్టిన చిన్నారి కూడా లోకాన్ని విడిచిపెట్టింది
ఇక, మాజీ మంత్రి, కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య రాసిన తాజా లేఖ మీ కోసం