Yanamala Krishnudu: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 27న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు యనమల కృష్ణుడు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.. మరోవైపు ఈ రోజు వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ నామినేషన్ కార్యక్రమంలో యనమల కృష్ణుడు పాల్గొంటారని తెలుస్తోంది.. ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు పూర్తి చేశారు..
Read Also: WHO: యువతలో పెరిగిన ఆల్కహాల్, ఈ-సిగరెట్ల వాడకం.. ఆందోళనలో డబ్ల్యూహెచ్ఓ
అయితే, గత కొంతకాలంగా యనమల సోదరుల మధ్య విబేధాలు తలెత్తాయి.. తుని నుంచి టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేస్తుండగా.. ఆ సీటును ఆశించిన యనమల కృష్ణుడు.. టీడీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే.. టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇక అన్న యనమల రామకృష్ణుడు తనను పిలిచి మాట్లాడక పోవడం, తనను పట్టించుకోకపోవడంతో తుని కూటమి అభ్యర్థి యనమల దివ్యకు సహకరించకుండా యనమల కృష్ణుడు ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే యనమల కృష్ణుడు రాకపై మంత్రి దాడిశెట్టి రాజాతో సీఎం జగన్ ఇప్పటికే చర్చించగా.. ఎటువంటి షరతులు లేకుండా వైసీపీలోకి రావాలని అధిష్టానం సూచించినట్టు ప్రచారం సాగుతోంది..