జగన్ ఒక బచ్చా అని కూడా చంద్రబాబు అంటున్నాడు.. చంద్రబాబు మాటలు చూస్తే కృష్ణుడిని బచ్చా అనుకున్న కంశుడు గుర్తుకు వస్తున్నాడు అని దుయ్యబట్టారు సీఎం జగన్.. హనుమంతున్ని బచ్చా అనుకున్న రావణుడికి కూడా ఏమైందో చూశాం... పేదలకు మంచి చేసి వుంటే బచ్చాను చూసి భయపడి 10 మందిని ఎందుకు పోగేసుకుంటున్నావు? అంటూ సెటైర్లు వేశారు.
జనసేనలో అనుభవం ఉన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసీపీలోకి రావడం హర్షణీయమని నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వైసీపీలోకి రావడాన్ని చూస్తే జనసేన ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందన్నారు.
ఏపీలో ఎన్నికల వేళ.. ఈసీ వద్ద వివిధ పార్టీల ఫిర్యాదులతో పంచాయతీ నెలకొంది. ప్రతి ఎన్నికల్లోనూ ఉండే తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ఈసీకి అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచి వైసీపీ - టీడీపీ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.
సీఎం జగన్ను చంపడానికే రాయి విసిరారని రిమాండ్ రిపోర్టులో కూడా రాసేశారు. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో పెరుగుతోందట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అంటే మామూలు విషయం కాదు. మొన్నటి వరకు నిందితుడి ఎవరో తెలీదు.. ఎవరో రాయి విసిరారు.. అది కూడా సరిగా కన్పించ లేదు... ఇదంతా ట్రాష్.. ఒట్టి డ్రామా అని కొట్టిపారేసిన టీడీపీ నేతల్లో..…
వాణి నా భార్య.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే అధికారం ఉంది.. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదన్నారు దువ్వాడ శ్రీనివాస్.. ఏం చేస్తాం.. కలియుగ ప్రభావం.. సొంత అన్నదమ్ములు, కుటుంబం తిరగబడవచ్చు.. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా చెప్పుకొచ్చారు..