Gautam Gambhir: “ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టాలనిపిస్తే కొట్టేయ్”.. అభిషేక్ ఫామ్‌పై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: భారత్ టీ20 వరల్డ్ కప్‌లో ఘన విజయం సాధించి మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సీజన్‌లో భారత్ రాణించడం వెనుక అందరి ప్లేయర్స్ కృషి ఉంది. అయితే.. ఈ వరల్డ్ కప్ సీరీస్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మపై ఎంతగా విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిషేక్ పేలవమైన ఫామ్ కారణంగా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించాలని డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించాయి. కానీ.. కోచ్ గంభీర్ మాత్రం చివరి వరకు అభిషేక్‌పై నమ్మకం ఉంచారు. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో అభిషేక్ గురించి గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ వరుసగా విఫలమవుతుండటంతో మాజీ ప్లేయర్స్ జాగ్రత్తగా ఆడాలని సలహా ఇచ్చాయి. కానీ.. కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం మరింత దూకుడుగా ఆడమని చెప్పేవాడట.
READ MORE: Shikhar Dhawan: ఎంఎస్ ధోనీ ఎంతో మంది క్రికెటర్ల కెరీర్‌లను తీర్చిదిద్దాడు.. కష్టకాలంలో అండగా ఉంటాడు!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
గంభీర్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. “2014 ఐపీఎల్ ప్రారంభంలో నేను వరుసగా మూడు సార్లు డకౌట్ అయ్యాను. నాలుగో మ్యాచ్‌లోనూ రాణించలేకపోయాను. అప్పుడు నేను బాగా ఆలోచించాను. మనం పరుగులు చేయలేకపోతున్నాం అంటే దానికి అర్థం ఫామ్‌లో లేమని కాదు.. కేవలం పరుగులు రావడం లేదని మాత్రమే. కనీసం 20-30 బంతులు ఆడితేనే ఒక ఆటగాడి ఫామ్‌ను అంచనా వేయగలం. కానీ అభిషేక్ కనీసం 20 బంతులు సైతం సరిగ్గా ఎదుర్కోలేదు. అయితే.. నేను అభిషేక్‌కు ఒక సలహా ఇచ్చాను. నెక్ట్స్ మ్యాచ్‌లో మొదటి బాల్‌లో సిక్స్ కొట్టాలని నీకు అనిపిస్తే అలాగే కొట్టేసెయ్. ప్రపంచం ఏమనుకుంటుందో నీకు అనవసరం. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆ 30 మంది నీ గురించి ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. సెలెక్ట్ అయిన ప్రతి ఆటగాడిపై మాకు పూర్తి నమ్మకం ఉంది.” అని అభిషేక్‌కు చేయూత ఇచ్చినట్లు గంభీర్ వివరించారు. అంతేకాదు.. సంజూ శామ్సన్ ఎంపికపై సైతం గంభీర్ క్లారిటీ ఇచ్చారు. కేవలం స్పిన్నర్ల కోసం మాత్రమే సంజూను తీసుకోలేదని స్పష్టం చేశారు. మొదటి ఆరు ఓవర్లలో మరింత దూకుడును పెంచడానికే సంజూను టీమ్‌లోకి తీసుకున్నాం తప్ప, కేవలం ఆఫ్ స్పిన్నర్లను అడ్డుకోవడానికి కాదని క్లారిటీ ఇచ్చేశారు.
READ MORE: JR NTR : జూనియర్ ఎన్టీఆర్ వాచీల ఖరీదు అక్షరాలా పదమూడు కోట్లు..
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!