Shikhar Dhawan: ఎంఎస్ ధోనీ ఎంతో మంది క్రికెటర్ల కెరీర్‌లను తీర్చిదిద్దాడు.. కష్టకాలంలో అండగా ఉంటాడు!
- ఎంఎస్ ధోనీ గురించి ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ధోనీ ఎంతో మంది క్రికెటర్ల కెరీర్‌లను తీర్చిదిద్దాడు
- కష్ట కాలంలో కూడా అండగా నిలిచాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతో మంది క్రికెటర్ల కెరీర్‌లను తీర్చిదిద్దడంలో మహీ కీలక పాత్ర పోషించాడని చెప్పాడు. తన కెరీర్‌లో ఎదురైన ప్రతి కష్ట సమయంలోనూ తనకు అండగా నిలిచాడని గుర్తుచేసుకున్నాడు. నాలుగు లేదా ఐదు మ్యాచ్‌లలో పరుగులు చేయకపోయినా.. అది ఆటగాడి ప్రతిభకు అడ్డంకి కాదని ధోనీ నమ్మేవాడని చెప్పాడు. తక్షణ ఫలితాలు రాకపోయినా.. భవిష్యత్తులో ఓ ప్లేయర్ జట్టుకు కీలకంగా మారుతాడనే నమ్మకంతో మహీ ఆటగాళ్లను ప్రోత్సహించేవాడని గబ్బర్ చెప్పాడు.
తాజాగా శిఖర్ ధావన్ మాట్లాడుతూ… ఎంఎస్ ధోనీ ఎంతో మంది ఆటగాళ్ల కెరీర్‌లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. నా కెరీర్‌లో ఉన్నత సమయంలోనే కాదు, కష్ట కాలంలో కూడా అండగా నిలిచాడు. మహీ మద్దతు పొందిన వారిలో నేను ఒక్కడినే కాదు.. చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఒక మ్యాచ్‌లో విఫలం అయితే.. ఓ ప్లేయర్ విజయవంతం కాలేడని ధోనీ భావించడు. ఓ ఆటగాడిలో ఎంత ప్రతిభ, సామర్థ్యం ఉందో ముందే గుర్తిస్తాడు. 4-5 మ్యాచ్‌లలో పరుగులు చేయలేకపోయినా.. అది ఆటగాడి కెరీర్‌కు అడ్డంకి కాకూడదని నమ్ముతాడు. ఆ సమయంలో కూడా ఆటగాడికి నిరంతరం అవకాశాలు ఇవ్వాలని ధోనీ భావిస్తాడు’ అని చెప్పాడు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
Also Read: AP Power Consumption: యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం!
‘ఒక ఆటగాడు మ్యాచ్‌ను గెలిపించే సామర్థ్యం ఉన్నవాడని ఎంఎస్ ధోనీ నమ్మితే.. అవకాశాలు ఇస్తుంటాడు. 1-2 మ్యాచ్‌కే ఏ ఆటగాడిని పరిమితం చేయడు. వెంటనే ఫలితం రాకపోయినా భవిష్యత్తులో బాగా రాణిస్తాడని ముందుగానే గుర్తించే దూరదృష్టి ఆయనకు ఉంటుంది. ధోనీ ఆటగాళ్లను ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. అవసరమైతే సూచనలు, సలహాలు కూడా ఇచ్చేవాడు. అందుకే జట్టులో ఎక్కువగా మార్పులు చేసేవాడు కాదు. మహీ భాయ్ నాకు ఎంతో మద్దతు ఇచ్చాడు. అందుకే నేను ఆయనకు రుణపడి ఉంటా’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. ధావన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!