LPG Crisis: వారికి కేంద్రం షాక్.. “నో బుకింగ్, సిలిండర్ సరెండల్ చేయాలి “..
- పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నవారికి కేంద్రం షాక్..
- సిలిండర్ సరెండర్ చేయాలని ఆదేశాలు..
- కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు, రీఫిల్ బుకింగ్స్‌కు నో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇరాన్ యుద్ధం దేశంలో వంటగ్యాస్ (LPG) ఆందోళన్ని పెంచుతోంది. యుద్ధం వల్ల ఎల్పీజీ కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు ‘‘పానిక్ బుకింగ్స్’’ చేస్తున్నారు. సాధారణం కన్నా ప్రతీ రోజు 25 లక్షల సిలిండర్లు ఎక్కువగా బుక్ అవుతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రకటించింది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో చమురు, గ్యాస్ కొరత లేదని చెబుతోంది. అయినప్పటికీ, ప్రజల భయాలు ఇంకా తగ్గడం లేదు.
ఇదిలా ఉంటే, ఈ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కొందరికి షాక్ ఇచ్చింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ మరియు డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ రెండూ ఉన్నవారు రెండో దాన్ని సరెండర్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ప్రభుత్వ చమురు కంపెనీ లేదా పంపిణీదారుడు ద్వారా వారికి సిలిండర్ రీఫిల్ బుకింగ్స్ నిలిపేయాలని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
Read Also: Robin Uthappa: “ఇదే లాస్ట్”.. ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై రాబిన్ ఉతప్ప సంచలన ప్రకటన..
నోటిఫికేషన్ ప్రకారం.. ఇంట్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్న కుటుంబాలు తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్‌పీజీ (సిలిండర్) కనెక్షన్‌ను వెంటనే సరెండర్ (వదులుకోవాలి) చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశించింది. పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నవారు ఇకపై సిలిండర్ రీఫిల్స్ బుక్ చేయకూడదని, ప్రభుత్వ చమురు సంస్థల నుంచి కొత్త ఎల్పీజీ కనెక్షన్లు తీసుకోవడంపై కేంద్రం నిషేధించింది. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం నోటిఫికేషన్ పేర్కొంది.
ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతాల నుంచి చమురు, గ్యా్స్ సరఫరాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగమతి చేసుకుంటుంది. ఇందులో 85-90 శాతం సౌదీ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి వస్తోంది. ఈ కారణంగా దేశంలో ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది.
తాజావార్తలు
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!