మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. గురువారం రోజు కిరణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి.. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు అని ఫైర్ అయ్యారు.. నేను కాంగ్రెస్ లో ఉండి సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదు.. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి…
జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ మాజీ మేయర్ సరోజతోపాటు పలువురు నేతలు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ సరోజ మాట్లాడుతూ. జనసేన పార్టీలో మహిళలకు బీసీలకు గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు నచ్చక రాజీనామా చేసి వైసీపీలో చేరామని చెప్పారు. జగన్ నాశనం కావాలని కోరుకుంటున్న పవన్, చంద్రబాబు నాశనం…
అల్లూరి జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యారు. ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ వర్షా బాలకృష్ణ (40) దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు బాలకృష్ణ తలపై బండరాయితో మోదటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో కొందరు వ్యక్తులతో జరిగిన గొడవలో వారు బండరాయితో కొట్టి చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కన్నాయిగూడెం గ్రామశివార్లలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి…
ఏపీలో ఎన్నికల్లో జోరు పేరిగింది. నిన్న ఎన్నికల నోటిషికేషన్ విడుదల కావడంలో పశ్చిమగోదావరి జిల్లాలో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు మంత్రులు. గోపాలపురంలో హోంమంత్రి తానేటి వనిత నామినేషన్‌కు సిద్ధం కాగా… తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు నామినేషన్ వేయనున్నారు. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అని, దెందులూరులో ఎమ్మెల్యే అబ్బాయచౌదరి నామినేషన్లు అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టి.. చీపురుపల్లి మూడు…
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సైన్యం ప్రచారానికి సిద్ధమైంది. శంకరన్న కోసం మేమంతా సిద్ధం అంటూ నినాదించింది. క్రోసూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆవిష్కరించారు.