CM YS Jagan Nomination: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఈ రోజు కీలక ఘట్టం ముగియనుంది.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుండడంతో.. ఉదయమే తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు సీఎం వైఎస్ జగన్.. ఈ రోజు తాడేపల్లిలోని ఇంటి నుంచి తన భార్య వైఎస్ భారతితో కలిసి బయల్దేరిన సీఎం జగన్.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.. ఇక, కడప నుంచి హెలికాప్టర్‌లో పులివెందులలో దిగారు.. మొదట సీఎస్‌ఐ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగసభలో పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు.. ముఖ్యంగా తమ ప్రాంత నేతలపై, వైఎస్ వివేకా కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు..
Read Also: CM Revanth Reddy: మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ చార్జీ షీట్.. విడుదల చేసిన సీఎం రేవంత్
అనంతరం పులివెందుల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి . బహిరంగ సభ ముగియగానే సీఎస్‌ఐ గ్రౌండ్ నుంచి నేరుగా మినీ సెక్రటేరియట్‌లోని ఆర్వో ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో పులివెందులలో ఎన్నికల ప్రచార బాధ్యతలను తన సతీమణి వైఎస్ భారతికి అప్పజెప్పారు సీఎం జగన్.. నేటి నుంచి వారం రోజుల పాటు పులివెందులతో పాటు కడప లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు వైఎస్ భారతి.