రేపు పులివెందులలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టిన వైసీపీలో ఫుల్జోష్ కనపడుతోంది. ఈ జోష్లోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు.
వై నాట్ 175 టార్గెట్గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అక్కవరం సభ తర్వాత తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. రేపు(ఏప్రిల్ 25) పులివెందులలో నామినేషన్ వేస్తారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనే.. మరో విడత ప్రచారానికి కూడా వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.
నెల్లూరు లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయడం నా జీవితంలో మర్చిపోలేని రోజుగా అభివర్ణించారు నెల్లూరు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి.. ఈ రోజు నెల్లూరు లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుట్టి పెరిగిన నెల్లూరు లోక్ సభకు పోటీ చేయడం జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు.
ఏలూరు జిల్లా కైకలూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ.. భారీ అభిమానులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ వేయడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖపట్నం జిల్లా ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు. విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను సీఎంకు నివేదించారు కార్మిక సంఘాల నాయకులు. ఇక, ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎం.. రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్పీపీ కూడా స్టీల్ ప్లాంట్…
భారీగా తరలి వచ్చిన అశేష జనవాహనితో పెదకూరపాడు జనసంద్రంగా మారింది. పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరు శంకరరావు నామినేషన్ దాఖలు చేశారు.