రాబోయే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారానికి కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు (DNR) తో కలిపి ఆయన సతీమణి దూలం వీర కుమారి కైకలూరు మండలంలోని ఆటపాక పంచాయతీ పరిధిలో పార్టీ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ని, కైకలూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావుని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను దూలం వీర కుమారి అభ్యర్థించారు.
Read Also: Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో శివసేన రెడ్డి
కాగా, ఈ సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. టీడీపీ- జనసేన- బీజేపీ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెబుతూ, మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమకు మద్దుత ఇవ్వకపోతే మీ కుటుంబాలు ఉండవంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ బెదిరించే నాయకులకు నేను సవాల్ చేస్తున్నా.. ప్రజల దగ్గరకు రావాలంటే.. డీఎన్ఆర్ అనే వ్యక్తిని దాటుకొని రావాలన్నారు. అక్కడ ప్రజలను 40 ఏళ్ల నుంచి పీల్చి పిప్పి చేశారని.. గత పాలకులు ఆటపాక గ్రామానికి చేసిన అభివృద్ధి శూన్యం అని కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు.