కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కామెంట్స్‌కు బొత్స కౌంటర్ ఇచ్చారు. రైల్వేజోన్ భూములు, మాఫీయా ప్రభుత్వం వ్యాఖ్యలు చూస్తుంటే గురివింద పూస గుర్తుకు వస్తుందని ఆయన విమర్శించారు. జీవీఎంసీ కమిషనర్ రైల్వేశాఖకు ఇచ్చిన ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ బహిర్గతం చేసిన బొత్స….. 2014లో చేతకాని దద్దమ్మ ను ముఖ్యమంత్రిగా పెట్టుకుని మా మీద ఆరోపణలు చేస్తే ఎలా…? అని ఆయన ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో రైల్వే భూములు అడ్డంకులు తొలగించి భూములు అప్పగించామని ఆయన పేర్కొన్నారు. రైల్వే మంత్రిగా పనిచేసి జోన్ నిర్మాణం చేయలేని పీయిష్ గోయ ల్ ఇప్పుడు వచ్చా డబ్బా కబుర్లు చెబుతున్నారని, ఎలక్ట్రో లర్ బాండ్స్ లావాదేవీల గురించి బీజెపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు మంత్రి బొత్స సత్యానారాయణ.
పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వాటిని వెన్నక్కి తీసుకోవాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు. ద్ర మంత్రి పాసింగ్ రిమార్క్స్ , చౌకబారు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. రెండు డొక్కు లు వేస్తాయి……రెండు చిత్తు కాగితాలు ప్రింట్ చేస్తాయని ఇది పడితే అది మాట్లాడితే సహించమని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. విద్యాశాఖ పై వస్తున్న కథనాలు నిరూపించాలన్నారు. ఏనుగు వెళుతుంటే మొరుగుతున్నట్టు కనిపిస్తోందని, నిజం లేదు కనుకనే నమ్మించెందుకు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారన్నారు. విద్యాశాఖ పని తీరుకు పరీక్షలు నిర్వహణ, ఫలితాలు నిదర్శనమన్నారు. విద్యాశాఖలో ఏ మార్పులు చేసిన ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే తీసుకుంటున్నాం…. ఆ మార్పు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో వున్న 90వేల మంది ఉపాధ్యాయులు వున్నారు వాళ్ళందరికీ వాస్తవాలు తెలుసు అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.