ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన యనమల కృష్ణుడు నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో -2024ను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, అమలు చేసిన విధానాన్ని వివరించిన ఆయన.. విపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. ఇక, 9 ముఖ్యమైన హామీలతో వైసీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు.. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలకు ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారిత, సామాజిక భద్రతతో…
ఈ రోజు వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్. నవరత్న హామీలను కొనసాగించనున్నారు. అంతేకాదు.. డీబీటీ పథకాలకు సంబంధించి నగదు పెంపు హామీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కామెంట్స్‌కు బొత్స కౌంటర్ ఇచ్చారు. రైల్వేజోన్ భూములు, మాఫీయా ప్రభుత్వం వ్యాఖ్యలు చూస్తుంటే గురివింద పూస గుర్తుకు వస్తుందని ఆయన విమర్శించారు. జీవీఎంసీ కమిషనర్ రైల్వేశాఖకు ఇచ్చిన ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ బహిర్గతం చేసిన బొత్స….. 2014లో చేతకాని దద్దమ్మ ను ముఖ్యమంత్రిగా పెట్టుకుని మా మీద ఆరోపణలు చేస్తే ఎలా…? అని ఆయన ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో రైల్వే భూములు అడ్డంకులు తొలగించి భూములు అప్పగించామని ఆయన పేర్కొన్నారు. రైల్వే…