తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'మహిళల ఆరోగ్యమే.. ఇంటి శ్రేయస్సు' అని నమ్ముతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
సైన్యంలో మహిళలు రాణించడమంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఇప్పుడు అది చిన్నవిషయంగా మారిపోతోంది. ఎందుకంటే మహిళలు ఇప్పుడు త్రివిధ దళాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
తెలంగాణ మహిళామణులకు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కానుకను ప్రకటించింది. మార్చి 8న 'ఆరోగ్య మహిళ' పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
పాకిస్తాన్ లో స్వేచ్ఛ అనే పదానికి పెద్దగా అర్థం లేదు. అక్కడ పేరుకే ప్రజాస్వామ్యం నడిచేదంతా సైన్యం పాలన. ఇక మహిళల హక్కులు, స్వేచ్ఛకు అక్కడ అవకాశమే లేదు. చివరకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు కూడా మహిళల ర్యాలీపై నిషేధం విధిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.
పిల్లలను పెంచే చేతులే మొక్కలు నాటితే ప్రకృతి మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు.మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం రోజున తమ పిల్లలపై చూపిన ప్రేమానురాగాలతో మహిళా సంఘం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్ నగరంలోని యాప్రాల్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నీ ముగిసింది. స్కైకింగ్స్ సహకారంతో ఒలింపియన్ అసోసియేషన్ యాప్రాల్‌లోని మెహర్‌బాబా కాలనీలో ఈ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ టోర్నీకి ముఖ్య అతిథిగా నేరేడ్‌మెట్ 136వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తి గల మహిళలందరూ ఫుట్‌బాల్ లీగ్‌లో పాల్గొనేందుకు ముందుకు రావాలని ప్రోత్సహించారు. మహిళలందరూ తమ లక్ష్యాలను సాధించడానికి…
మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా వరుణ్ తేజ్ అమ్మాయిల మధ్య కూర్చుని చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. వరుణ్ మెగా అమ్మాయిలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పిక్ ని పోస్ట్ చేశారు. “ప్రపంచంలోని ఇన్క్రెడిబుల్ వుమెన్ అందరికీ, ఈరోజు మాత్రమే కాకుండా ప్రతి రోజూ ప్రకాశిస్తూ ఉండండి. #మహిళ దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ వరుణ్ విష్ చేశారు. ఈ పిక్ లో వరుణ్ నిహారిక, సుస్మిత, శ్రీజతో కలిసి పోజులిచ్చారు. వరుణ్ తన…