మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్ నగరంలోని యాప్రాల్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నీ ముగిసింది. స్కైకింగ్స్ సహకారంతో ఒలింపియన్ అసోసియేషన్ యాప్రాల్‌లోని మెహర్‌బాబా కాలనీలో ఈ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ టోర్నీకి ముఖ్య అతిథిగా నేరేడ్‌మెట్ 136వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తి గల మహిళలందరూ ఫుట్‌బాల్ లీగ్‌లో పాల్గొనేందుకు ముందుకు రావాలని ప్రోత్సహించారు. మహిళలందరూ తమ లక్ష్యాలను సాధించడానికి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా ఈ ఫుట్‌బాల్ టోర్నీలో నాలుగు జట్లు తలపడగా… FORTRESSE అనే జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్‌గా VVNFC టీమ్ నిలిచింది.
కాగా గత 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న తమ ఉపాధ్యాయ సోదర సమానమైన మహిళలను సత్కరించడానికి ఒలింపియన్ ప్రారంభించినట్లు కార్పొరేటర్ మీనా ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈ టీమ్‌లో సోషల్ టీచర్ టి.విజయలక్ష్మీ, హిందీ టీచర్ నాగరత్న, స్కూల్ అకడమిక్ ఇంఛార్జ్ సి.రాధారాణి, సామాజిక కార్యకర్త, డిజిస్త్రీ ఫౌండర్ శ్రీదేవి, మార్కోమ్ కో ఫౌండర్ సాద్న బాసంగర్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉదయశ్రీ ఉన్నారని.. వీరంతా సమాజంలో మార్పు కోసం నిరంతరం పాటుపడుతున్నారని కొనియాడారు.