Minister: మహిళలు తమ రక్షణ కోసం తమ పర్సులో కత్తి, కారం పొడిని తీసుకెళ్లాలని, లిప్ స్టిక్‌తో పాటు ఇవి కూడా ఉండాలని మహారాష్ట్ర మంత్రి గులబ్‌రావ్ పాటిల్ శనివారం సూచించారు.
Women's Day: మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్సీపీ -శరద్ పవార్ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంచలన లేఖ రాశారు. మహిళలు అణచివేత మనస్తత్వం, అత్యాచార మనస్తత్వం, నిష్క్రియాత్మక శాంతిభద్రత ధోరణిని చంపాలనుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ముంబైలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారాన్ని లేఖలో ఖడ్సే పేర్కొన్నారు.
Home Minister Anitha: విజయనగరంలోని రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఇక, స్త్రీ నిధీ చెక్కును మహిళలకు మంత్రి అందజేసింది.
మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. మెగా బంధాన్ని, మహిళా సాధికారితను చాటి చెప్పేలా చిరంజీవి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలో అంజనమ్మ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అంజనమ్మ గురించి మెగా సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి చెప్పిన విషయాలు, ఉమెన్స్ డే సందర్భంగా మెగా మహిళా కుటుంబం చెప్పిన ఆసక్తికర సంగతులు ఏంటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ…
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు. మహిళా దినోత్సవ సంబరాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర సంస్థగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మహిళందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Nadendla Manohar: అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల పూర్తి భద్రతకి ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో వంద శాతం చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
అమ్మవారి శక్తి స్వరూపాలు... సృష్టికి మూల కారకులు... కుటుంబాన్ని, సమాజాన్ని కంటికి పాపలా కాపాడుతున్న స్త్రీ మూర్తులందరికీ కేంద్రమంత్రి బండి సంజయ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో ఏమీ ఆశించకుండా పిల్లల ఎదుగుదలకు జీవితాన్నే త్యాగం చేసేది తల్లి మాత్రమే.. అక్కా చెల్లెళ్ల రూపంలో, భార్యగా తోడునీడగా నిలిచేది స్త్రీ మూర్తులే.. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఒక పక్క సినిమాలు బిజీ బిజీగా చేస్తూనే మరో పక్క పర్సనల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అంతేకాక నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ ♀…