\Shaliza Dhami: సైన్యంలో మహిళలు రాణించడమంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఇప్పుడు అది చిన్నవిషయంగా మారిపోతోంది. ఎందుకంటే మహిళలు ఇప్పుడు త్రివిధ దళాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. గతంలో వివిధ భారత సైనిక దళాలలో పురుషులు మాత్రమే ముందుండే మహిళలు త్రివిధదళాలలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష యుద్ధరంగంలో క్రియాశీలక పాత్రలో ఉండేవారు కాదు. ఇప్పుడు త్రివిధ దళాల్లో తమ శక్తి యుక్తులను నిరూపించుకుంటూ పురుషులకు దీటుగా సత్తా చాటుతున్నారు. షాలిజా ధామి చరిత్ర సృష్టించనుంది. ఎయిర్ ఫోర్స్ ఫ్రంట్ లైన్ కంబాబ్ యూనిట్‌కి మహిళా అధికారిగా రానున్నారు. భారత వైమానిక దళం పాశ్చాత్య సెక్టార్‌లోని ఫ్రంట్ లైన్ కంబాట్ యూనిట్‌కు నాయకత్వం వహించనున్నారు. ఈ మేరకు గ్రూప్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు షాలిజా ధామి.
Read Also: Rahul Gandhi: అమెరికా, యూరప్ జోక్యం కోరిన రాహుల్.. తీవ్రంగా స్పందించిన బీజేపీ
ఈ సందర్భంగా షాలిజా ధామి ఎంపిక మహిళా లోకానికి స్పూర్తిదాయకం కానుంది. ఐఏఎఫ్ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఒక మహిళా అధికారికి ఫ్రంట్ లైన్ కంబాట్ యూనిట్‌కు ఎంపిక చేయడం విశేషం. ఆమె అసాధారణమైన ప్రతిభకు, పట్టుదలకు, నిబద్దతకు దక్కిన గౌరవం అని చెప్పక తప్పదు. ఈ నెల ప్రారంభంలో సైన్యం మొదటిసారిగా కమాండ్ పాత్రలకు మహిళా అధికారులను కేటాయించడం ప్రారంభించింది. వీరిలో దాదాపు 50 మంది ఫార్వర్డ్‌తో సహా కార్యాచరణ ప్రాంతాల్లో యూనిట్‌లకు చీఫ్‌లుగా వ్యవహరిస్తారు. ఇది ఉత్తర, తూర్పు కమాండ్‌లలో జరుగుతుంది. ఇక గ్రూప్ కెప్టెన్ ధామి 2003లో హెలికాప్టర్ పైలట్‌గా నియమితులయ్యారు. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం కలిగి ఉన్నారు షాలిజా దామ . క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నారు. ఆమె వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్‌గా పని చేశారు. ఐఏఎఫ్‌లో గ్రూప్ కెప్టెన్ ఆర్మీలో కల్నల్‌తో సమానం.
Indian Air Force has selected Group Captain Shaliza Dhami to take over command of a frontline combat unit in the Western sector. pic.twitter.com/qb85HvLSil
— ANI (@ANI) March 7, 2023