తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని.. అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ శిశు సంక్షేమ , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాటు పలువురు మహిళ అధికారిణిలు పాల్గొన్నారు.
గత తొమ్మిదేళ్లలో ఎవిస్ ఆసుపత్రి ప్రస్థానంలో మహిళా ఉద్యోగుల పాత్ర అద్వితీయమని ఆసుపత్రి మానేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజా.వి.కొప్పాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా శనివారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రోగులకు సేవలకు సంబంధించి ఇన్నేళ్లలో నాలుగు ఫిర్యాదులు మినహా ఎటువంటి సమస్యలు లేకపోవడం విశేషమన్నారు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ దేశ మహిళలపై ప్రశంసలు కురిపించారు. దేశంలో జననాల రేటు పెంచేందుకు రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటీవల పలుమార్లు రష్యా అధినేత మహిళలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. మాతృత్వం, ఆకర్షణ, అందం యొక్క బహుమతులను అందించినందుకు మహిళల్ని ప్రత్యేకంగా వారిని అభినందించారు. మార్చి 8 అనేది సోవియల్ సమయం నుంచి రష్యాలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటిగా ఉంది. స్త్రీల గొప్పతనం గురించి వారి నైపుణ్యాల…
బుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎదో మిగిలే ఉంటుంది.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు.. నాలుగైదు భాషల మీద పట్టు, సమయస్ఫూర్తి సుమను బెస్ట్ యాంకర్ చేశాయి. కొన్ని ఐకానిక్ షోస్ కి ఆమె యాంకర్…
ప్రముఖ విద్యావేత్త సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసారు. ప్రెసిడెంట్ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఉమెన్స్ డే రోజున ఈ ప్రకటన వెలువడడం విశేషం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి మహిళలను ప్రోత్సహించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిట్స్ పిలాని కళాశాల వేదికగా జరుగుతున్న వేడుకలలో ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. బిట్స్ పిలాని కళాశాలలో వీ ఫర్ యూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Exxeella Group: తెలుగు రాష్ట్రాలలోని మహిళలందరికీ “అంతర్జాతీయ మహిళా దినోత్సవ” శుభాకాంక్షలు తెలియజేస్తూ “అన్ని రంగాలలో మహిళలకు ఎప్పుడైతే ప్రాధాన్యత ఉంటుందో అప్పుడే దేశం ముందుకు సాగుతుంది” అని ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ వ్యవస్థాపకుడు/చైర్మన్ అరసవిల్లి అరవింద్ గారు వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత అంటే సంక్షోభ సమయంలో అనేక విధాలుగా మహిళల్లో అంతులేని శక్తిని మరియు ధైర్యాన్ని పెంపొందింపచేయడమే అని, ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్‌లో మహిళలు స్వేచ్ఛను ఆస్వాదిస్తారని మరియు తమ నిర్ణయాలను స్వేచ్చగా వెల్లడిస్తారని, ఎందుకంటే…