సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళలకి అత్యధిక ప్రాధాన్యత ఉందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పధకాలన్నీ మహిళా లబ్దిదారులకి అందేలా కృషిచేస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగులకి అభినందనలు తెలిపారు. నాకు చిన్నప్పటి నుంచి మా అన్నయ్యలే నాకు అండగా నిలబడ్డారన్నారు. నేను సినిమాలలోకి అడుగు పెట్టేటపుడు నాకు తోడుగా మా అన్నయ్యలు వచ్చేవారని, రాజకీయాలలో నన్ను నా భర్త సెల్వమణి ప్రోత్సహించారని ఆమె వెల్లడించారు. నేను…
మహిళా సాధికారతకు అర్ధం చెప్పేలా ఇక్కడికి వచ్చిన మహిళలు అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు హ్యాపీ ఉమెన్స్ డే. ఆధునిక ఏపీ లో మహిళలకు దక్కిన గౌరవానికి రాష్ట్ర మహిళలందరూ ప్రతినిధులే. స్టేజి మీద కాదు …స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులే. ప్రతి ఒక్కరూ సాధికారతకు ప్రతినిధులుగా ఉన్న మహిళలే. మహిళా జనసంద్రం చూస్తుంటే ఐన్ రైన్డ్ అనే మహిళ మాటలు గుర్తొస్తున్నాయి. మహిళగా నన్ను ఎవరు గుర్తిస్తారన్నది కాదు.. ఆత్మవిశ్వాసం…
మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. ఇవాళ SHO గా నియామకం అయిన మధులతకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇండియాలో ప్రతీ రోజు ఉమెన్స్ డే నే…మన దేశంలో మహిళలను గౌరవించుకుంటాం. విదేశాల్లో అలా ఉండదు. పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది పాత్ర కీలకం… వారి సంఖ్య కూడా పెరిగింది.. అన్నీ పీ. యస్ లలో మహిళా సిబ్బంది కి అన్నీ వసతులు…
సిటీ పోలీస్ తరపున మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హోం గార్డ్ స్థాయి నుండి డీసీపీ వరకు మహిళా పోలీస్ అధికారిణి లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం అనేది చాలా ముఖ్యమయినది. అన్ని రంగాలలో మహిళల పాత్ర పెరుగుతుంది… యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు కూడా మహిళలు ముందు ఉండి నడిపిస్తున్నారు. ఇటీవల సినిమాలలో కూడా మహిళల…
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. మహిళ చేసే త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరు ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. పలువురు ప్రముఖులు సైతం వారి జీవితాల్లో అండగా నిలిచినా మహిళలకు ఉమెన్స్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో హాట్ యాంకర్ అనసూయ ఉమెన్స్ డే రోజున నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. మహిళా దినోత్సవం రోజున ట్రోలర్స్ కి గట్టి షాక్ ఇస్తూ ట్వీట్ చేసింది. ” ఓ…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వనిత టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా సెల్వమణి ముచ్చటించారు. ఇది వనిత టీవీకి ప్రత్యేకం. ఓ సాధారణ మహిళ మంచి డాక్టర్ అవుతుంది. ఓ సాధారణ మహిళ గవర్నర్ గా మారి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మహిళలు అన్ని రకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. తన తల్లి తనకు స్ఫూర్తి…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తెలంగాణ ఆర్టీసీ నజరానా ప్రకటించింది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మహిళల కోసం పలు ఆఫర్లను కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన మహిళలకు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ అవకాశం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుందని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 8న మంగళవారం నాడు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాజువల్ లీవ్‌ను ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ జీవో జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును పండుగలా జరుపుకోవాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో…