మెగాస్టార్ చిరంజీవి ఒక పక్క సినిమాలు బిజీ బిజీగా చేస్తూనే మరో పక్క పర్సనల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అంతేకాక నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ ♀ శుభాకాంక్షలు #HappyWomensDay అని అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
International Women’s Day: ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” స్టోరీ ఇదే..
ఇక ఈ ఫోటోలో తన భార్య సురేఖతో పాటు తనతో కలిసి ఎన్నో సినిమాలు చేసిన రాధిక, కుష్బూ, నదియా, సుహాసిని, మీనా, జయసుధ వంటి వారు కనిపిస్తున్నారు. ఇక ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభరశి సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కించబోతున్నారు.