Home Minister Anitha: విజయనగరంలోని రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఇక, స్త్రీ నిధీ చెక్కును మహిళలకు మంత్రి అందజేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు దేవతలతో సమానం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం సమాజ బాధ్యత.. సమాజంలో మహిళలు రోజురోజుకు ముందుకు వెళ్తున్నారు.. మహిళలపై ఆధారపడి ప్రస్తుతం ప్రభుత్వాలు నడుస్తున్నాయి.. ఆడపిల్లలే ముఖ్యం అని ఇప్పుడు సమాజం భావిస్తుంది.. వంటింటి నుంచి అసెంబ్లీలో అధ్యక్ష అనే స్థాయికి మహిళలు ఎదిగారు అంటే అన్న ఎన్టీరామారావు చొరవ.. మహిళల కన్నా పురుషులు ఎక్కువుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి.. మహిళలకు ధైర్యం, ఆత్మస్థైర్యం ఎక్కువ అని మంత్రి అనిత పేర్కొన్నారు.
Read Also: Tuk Tuk : ఏఐ టెక్నాలజీతో సినిమా సాంగ్ షూట్.. ఏ సినిమాలో అంటే.?
ఇక, మహిళలు ఎప్పుడో సాధికారత సాధించారు అని హోంమంత్రి అనిత తెలిపారు. డ్వాక్రా సంఘాలు ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు.. నేను ఒక సాధారణ టీచర్ ను.. రాజకీయాలు అనేసరికి కోట్లు ఉండాలనికుంటారు.. కానీ, చద్రబాబు నన్ను చదువు అడిగారు.. కేవలం నా చదువే-నా పెట్టుబడి.. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.. ఆడపిల్లలకు రక్షణ శక్తి యాప్ ఉంది.. ఆడపిల్లలను ధైర్యంగా పెంచండి అని పిలుపునిచ్చింది. చదువు తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిగా ఇవ్వాలి.. ఆడపిల్లల లాగే మగ పిల్లలను కూడా జాగ్రత్తగా, క్రమశిక్షణగా పెంచాలి అన్నారు. మగ పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దండి అని సూచించింది. సూపర్ సిక్స్ పథకాలు అతి త్వరలోనే అమలు కానున్నాయని వంగలపూడి అనిత చెప్పుకొచ్చింది.