త్రిపురలో అమానుష ఘటన వెలుగుచూసింది. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కుమారులే కర్కశంగా సజీవదహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలచివేసింది. పశ్చిమ త్రిపురలోని చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్‌బారిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ మహిళకు ఏం ఆపద, కష్టమొచ్చిందో.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ కాల్వలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెజవాడలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్క్రూ బ్రిడ్జి దగ్గర వండౌడ్ కాల్వలో ఇద్దరు పిల్లలతో సహా కాల్వలోకి దూకింది మహిళ. ఈ క్రమంలో.. అక్కడున్న స్థానికులు గమనించి ఏడాదిన్నర వయసున్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే.. ఆ చిన్నారిని హాస్పటల్‌కు తరలించే లోపే…
ఐఏఎస్ కోచింగ్ వ్యవస్థాపకుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన వికాస్ దివ్యకీర్తి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. పుస్తక పాఠాలు చెప్పడంతో పాటు జీవిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే మార్గాన్ని కూడా చూపుతున్నారు.
ముంబైలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. అంధేరీలో మ్యాన్‌హోల్‌లో పడి ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళను 45 ఏళ్ల విమల్ గైక్వాడ్‌గా గుర్తించారు.
పోలీసులు తనను వేధించిన విషయాన్ని ఓ బాధితురాలు వెల్లడించింది. ఆ రాత్రి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలిపై పోలీసు సిబ్బంది చేసిన అమానుష ప్రవర్తన వింటే మీరు కూడా షాక్ అవుతారు.
సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌లోని 2వ ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ఓ మహిళ ప్రయాణిస్తుంది. ఆమె ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్తుంది. న్యాయవాది అని చెప్పుకుంటున్న మహిళ టికెట్ లేకుండా రైలులోని సెకండ్ ఏసీలో ప్రయాణిస్తోంది. ఇంతలో టీటీఈ వచ్చి టికెట్ అడగ్గా ట్రైన్లో తీవ్ర గందరగోళం సృష్టించింది. తన పేరు చెప్పమని అడగ్గా.. చెప్పేందుకు నిరాకరించింది. టీటీఈతో పాటు తోటి ప్రయాణికులతో తీవ్ర వాగ్వాదానికి దిగింది.
యూపీలోని ఎటావాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయి ఏడేళ్లయినా ఓ మహిళ తల్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకుంది. అయితే.. తన అత్తమామలు, భర్త కూడా పిల్లలు కావడం లేదని కొట్టి హింసించే వారని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు.
ముంబైలో రోడ్డు పక్కన నిల్చున్న ఓ మహిళను బైక్ పై వచ్చి ఓ వ్యక్తి ఢీ కొట్టాడు. అంతేకాకుండా.. ఆ మహిళపై హెల్మెట్‌తో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోల్‌కతాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చింది. అయితే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.