ముంబైలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. అంధేరీలో మ్యాన్‌హోల్‌లో పడి ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళను 45 ఏళ్ల విమల్ గైక్వాడ్‌గా గుర్తించారు. ప్రమాద ఘటనపై ముంబై పోలీసులు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనపై విచారణకు కూడా బీఎంసీ ఆదేశించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళ భర్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారీ వర్షం సమయంలో అంధేరీ ఈస్ట్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భవనంలోని గేట్ నంబర్ 8 సమీపంలో పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్‌లో మహిళ పడిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆమెను గుర్తించి కూపర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మహిళ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Read Also: Emergency Movie: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ విడుదలకు మార్గం సుగమం.. కొన్ని సీన్స్ కట్
భారీ వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రైల్వే ట్రాక్‌లు, రోడ్లు నీట మునిగాయి, రాకపోకలు స్తంభించాయి. కనీసం 14 ఇన్‌కమింగ్ విమానాలు దారి మళ్లించబడ్డాయి. గురువారం ముంబై రవాణా నెట్‌వర్క్ నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో రాత్రికి రాత్రే పరిస్థితులు మెరుగుపడినప్పటికీ.. అక్టోబర్ 1 వరకు మరిన్ని జల్లులు కురిసే అవకాశం ఉంది. విమాన సేవలు పునఃప్రారంభించబడ్డాయి. అయితే పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల వరకు నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల్లో ముంబై.. దాని శివారు ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఇది తీవ్ర అంతరాయానికి దారితీసింది.
Read Also: IND vs BAN: బుమ్రా ఔట్.. అక్షర్ డౌటే! బంగ్లాతో రెండో టెస్టులో ఆడే భారత తుది జట్టు ఇదే