వయనాడ్‌లో ఇటీవల వరదలతో పాటు కొండచరియలు విరిగి పడిన ఘటనలో తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన యువతి జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆమెపై విధి మరోసారి కన్నెర్ర చేసింది. సర్వస్వం కోల్పోయి.. ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ మాటిచ్చిన వ్యక్తిని విధి.. రోడ్డు ప్రమాదం రూపంలో…
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డు పక్కన అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో బుధవారం సాయంత్రం నాటిదని చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనిపిస్తోంది.
కదులుతున్న అంబులెన్స్‌లో మహిళపై అత్యాచారం చేసి దోపిడీకి ప్రయత్నించిన కేసులో అంబులెన్స్ సహాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో అంబులెన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
గతేడాది ఓ మహిళ తనను తాను పెళ్లి చేసుకున్న ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా.. ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్. ఆమె పేరు సులనే కారీ. ఈ 36 ఏళ్ల మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే.. ఈమె 'సోలోగామి' తనను తాను పెళ్లి చేసుకోవడం ద్వారా ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. బ్రెజిల్‌కు చెందిన సులనే కారీ.. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తుంది.
పూణెలోని ఓ మురికివాడలో గది విషయంలో తలెత్తిన వివాదంతో తమ్ముడు, అతని భార్య తన సోదరిని హత్య చేశారు. ఇద్దరూ కలిసి మహిళ తల నరికి మృతదేహాన్ని నదిలో పడేశారు. ఈ క్రమంలో.. పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అష్ఫాక్ ఖాన్, అతని భార్య హమిదాగా గుర్తించారు.
జమ్మూకాశ్మీర్‌లోని రాజ్‌గఢ్, రాంబన్‌లో ఒక్కసారిగా బుధవారం సాయంత్రం క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున ప్రవాహం ఏరులైపారింది. ఆకస్మిక వరదల్లో మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయారు. మరో నలుగురు తప్పిపోయారు.
Wife Kills Husband: కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన ఈ ఘటన సిద్దవటం మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది. అయితే, రాయచోటి ఘాటులో పూర్తిగా పురుగులు పడిన గంగయ్య మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ గల్లంతు అయ్యింది.. ఫుట్ పాత్‌పై అందరిలాగే సదరు మహిళ నడుకుంటూ వెళ్తుండగా.. ఒక్కసారిగా ఫుట్‌పాత్ కుంగిపోయింది.. దీంతో.. ఆమె మురికికాలువలో పడి గల్లంతైంది.
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో సామూహిక అత్యాచారానికి గురై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే.. ఈ కేసును ఎఫ్ఐఆర్లో గ్యాంగ్ రేప్ కింద చేర్చడానికి పోలీసులు నిరాకరించారు. దానికి బదులుగా ఆత్మహత్యకు ప్రేరేపించే సెక్షన్లను జోడించారని మృతురాలి తండ్రి చెప్పాడు. దీంతో.. ఈ కేసుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.